Breaking News

జిల్లాలో నూరుశాతం ఈ క్రాప్ నమోదు చేయండి

-జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు పూర్తి స్థాయిలో సమాయత్తం
– ఖరీఫ్ సీజన్లో అవసరమైన ఎరువులు సిద్దం చేశాం
-ధాన్యం సేకరణ కోసం సమర్థవంత మైన ఆచరణలో తీసుకుని రావడం జరిగింది
– కలెక్టర్ డా కె. మాధవీలత
– జేసీ ఎన్. తేజ్ భరత్

రాజమహేంద్రవరం , నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా లో ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకుండా ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో ధాన్యం సేకరణ కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంనకు ముఖ్య అతిథిగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ , జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు, సభ్యులు, అధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం పిపిసి కేంద్రాల నిర్వహణ కోసం కొత్త మార్గదర్శకాలు రూపొందించడం జరిగిందన్నారు. నాటి కొత్త విధానంలో భాగంగా ఎదుర్కొన్న సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం, గత రబీలో సమర్థ వంతంగా అమలు చేసినట్లు తెలిపారు. ధాన్యం సేకరణ సందర్భంలో రైతులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సమన్వయం సాధించడం జరుగుతుందన్నారు. మీ అభిప్రాయాలు, సూచనలను మండల వ్యవసాయ సలహా మండలి సమావేశం ద్వారా జిల్లా స్థాయి కమిటీ దృష్టికి తీసుకుని రావాలని కోరారు. జిల్లాలో రెండు దశల్లో 130 అర్భికెల పరిధిలో కొనుగోలు కేంద్రాల పూర్తి సన్నద్ధం చేసినట్లు తెలిపారు. మూడో దశలో మిగిలిన 101 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జిపిఎస్ ట్రాకింగ్ సాఫ్ట్వేర్ అనుసంధానం చేయడం ద్వారా వాహనాల రాకపోకలను పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర కల్పించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారులు, సిబ్బంది ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ, ఈ పంట నమోదు , ఈ కేవైసి లక్ష్యాలను గ్రామ స్థాయి వి ఆర్వో, గ్రామ వ్యవసాయ సహయకులు సమన్వయం సాధించడం ముఖ్యం అన్నారు. జిల్లాలో 103726 మెట్రిక్ టన్నుల ఎరువులు లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుతం 32,062 మెట్రిక్ టన్నుల అర్భికే ల వద్ద సిద్దంగా ఉన్నాయని, వాటిలో సుమారు 25 వేల మెట్రిక్ టన్నుల లావాదేవీలు నిర్వహించినట్లు, డిమాండు కు అనుగుణంగా రైతులకు ఎరువులు సరఫరా చెయ్యడం జరుగుతుందని అన్నారు. చైర్ పర్సన్ బూరుగుపల్లి సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్క కౌలు రైతుకు సి.సి.ఆర్.సి కార్డులు అందజేస్తామని తెలిపారు. వివిధ మండల వ్యవసాయ సలహా మండలి ద్వారా వచ్చిన వివిధ అంశాలను జిల్లా స్థాయిలో చర్చించి, వాటికి పరిష్కారం దిశగా అడుగులు వేయడం జరిగిందని అన్నారు. వ్యవసాయం, అనుబంధ శాఖల అధికారులతో సమావేశంలో చర్చించిన్నట్లు తెలిపారు. 50 శాతం సబ్సిడీపై టార్పలిన్స్, స్ప్రేయర్స్, పవర్ టీల్లర్స్ అందించాలని, టొబాకో టిస్యూ కల్చర్ సాగు చేసే బ్యారెక్ రైతులకు యూనిట్ 25 పైసల సబ్సిడీపై విద్యుత్ సరఫరా, పుష్కర కాలువ పూడికతీత, కలుపు నివారణ చర్యలు, తదితర అంశాలను సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యులు కంటే తేజా, జి. జనార్ధన రావు, ఆదర్శ రైతులు ఎం.నరసింహారావు, డి. రామకృష్ణ, పీ. శ్రీనివాసరావు, సత్యనారాయణ, వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త ఎమ్. నంద కిషోర్, ఇతర వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు హార్టికల్చర్ అధికారి, ప్రాజెక్ట్ డైరెక్టర్ (మైక్రో ఇరిగేషన్) కే .స్వాతి , జెడి (మత్స్య) కృష్ణా రావు, డి వి హెచ్ వి ఎస్టీజి సత్య గోవింద్, ఎస్ ఈ ఇరిగేషన్ జి. శ్రీనివాస రావు, ఇతర అధికారులు, పలువురు రైతులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *