రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర పొగాకు పరిశోధన సంస్థ తో ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. గురువారం స్థానిక సిటిఆర్ఐ సెమినార్ హాల్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా సిటిఆర్ఐ డైరెక్టర్ డా ఎమ్. సురేష్ మాధవ్,వైస్ ఛాన్సలర్ ప్రో.. కె.పద్మరాజు, రిజిస్టర్ ప్రో.. జీ. సుధాకర్ లు హాజరై ఒప్పంద పత్రాల పై సంతకాలు చేసి పత్రాలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్. సురేష్ మాధవ్ మాట్లాడుతూ సిటిఆర్ఐ ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో సాధించిన పరిశోధనా ప్రగతి మరియు సంస్థ ద్వారా అందిస్తున్న సేవలను వివరించారు. ఎం ఓ యు ద్వారా సిటిఆర్ఐ, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు అధ్యాపకులకు ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయని అన్నారు. విద్య పరిశోధన ప్రాజెక్టులు వంటి అంశాలలో సంయుక్తంగా పనిచేయడానికి ఈ అవగాహన ఒప్పందం దోహదపడుతుందని తెలియజేశారు. రిజిస్టర్ ఆచార్య జి.సుధాకర్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం సాధించిన అభివృద్ధి అంశాలను తెలియ జేశారు. అలాగే ఉమ్మడి గోదావరి జిల్లాలోని సుమారు 400 అనుబంధ కళాశాలలో లక్షకు పైగా మంది విద్యార్థులతో చేస్తున్న కార్యక్రమాలు వివరించారు. వీసీ ఆచార్య కె పద్మరాజు మాట్లాడుతూ స్థానికంగా ఉన్న రెండు పెద్ద సంస్థల మధ్య అవగాహన ఒప్పందం కుదరడం ద్వారా సంస్థలకు మరియు సమాజానికి ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఇప్పటికే ఆదికవి నన్నయ యూనివర్సిటీతో కాకినాడ జేఎన్టీయూకే, ఎన్ ఐ టి తాడేపల్లిగూడెం డాక్టర్ వైయస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ లు కలిసి క్లస్టర్ యూనివర్సిటీ గా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. సి టి ఆర్ ఐ ఆధ్వర్యంలో నన్నయ యూనివర్సిటీ వేదికగా త్వరలో అంతర్జాతీయ సదస్సును నిర్వహిస్తున్నామని తెలియ జేశారు. విశ్వవిద్యాలయ అధికారులు డాక్టర్ కె రమణేశ్వరి, ఆచార్య కె రమేష్, ఆచార్య పి. సురేష్ వర్మ, ఆచార్య వై. శ్రీనివాసరావు, డాక్టర్ వి. పెర్సిస్, డాక్టర్ పి విజయనిర్మల, డాక్టర్ పి. వెంకటేశ్వరరావు, డాక్టర్ బి. జగన్మోహన్ రెడ్డి , సిటిఆర్ఐ విభాగ అధిపతులు డా కె. సరళ, డా కె. రాజశేఖర రావు, డా ఎల్ కె ప్రసాద్, డా హెచ్. రవి శంకర్, సిటీఆర్ఐ సంస్థ శాస్త్రవేత్తలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News