రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
1 1.2024 నాటికి నిర్ధారణ చెయ్యవలసి ఉన్న ఓటర్ల జాబితా కి చెందిన ప్రత్యేక సారాంశ సవరణ అనుగుణంగా ఎప్పటికప్పుడు పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి పరిష్కారం చెయ్యడం జరుగుతోందని జిల్లా ఎన్నికల అధికారి/ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి గురువారం డ్రాఫ్ట్ పబ్లికేషన్ రోజున పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల స్థితి, ఈపి, లింగ నిష్పత్తి మరియు ఓటర్ల నమోదు, అనోమలిస్ పెండింగ్, ముసాయిదా జాబితాపై ఓట్ల చేర్పులు, తొలగింపులు, సవరణలు, రాజకీయ పార్టీల ఫిర్యాదులు, ఈరోల్‌పై రిపోర్ట్ లు, ఎపిక్ కార్డుల జనరేషన్ & పంపిణీ, పీఎస్ఈలు, డీఎస్ఈలు, తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహిస్తున్న రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టరేట్ లోని వీసీ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్. దినేష్ కుమార్, డిఆర్ఓ జి. నరసింహులు సంబంధిత నియోజక వర్గ ఓటరు నమోదు అధికారులతో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, వివిధ రాజకీయ పార్టీలు ద్వారా వచ్చిన 7061 అభ్యంతరాలు పరిష్కారం చేశామని తెలిపారు. డూప్లికేట్ ఓట్లు 572, చిరునామా మార్పు కి చెందిన 716 , మరణించిన ఓటర్లు 5773 మందిని చెందిన అభ్యంతరాలు నూరు శాతం హాజరై పరిష్కారం చేశామన్నారు. అదే క్రమంలో ఓటర్ల జాబితా పై క్లైమ్స్ అండ్ అబ్జెక్షన్స్ దరఖాస్తుకు డిసెంబర్ 9 వతేది చివరి తేదీ అని పేర్కొన్నారు. వాటిని డిసెంబర్ 26 లోగా పరిష్కారం చేసేందుకు అవసరమైన ఆదేశాలు ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఒకే చిరునామా కింద పదికి మించి ఉన్న ఓటర్లు ఉన్న 1196 గృహాల్లో 14791 మంది ఉన్నట్లు గుర్తించామని వాటిలో 10985 ఓటర్లు సరైనవిగా, 3761 ఓటర్ల ఇంటి చిరునామా మార్పు చెందిన ఫారం 8 స్వీకరించినట్లు తెలిపారు. వాటిలో పరిష్కారం చేసిన తరువాత ఇంకా 813 మందికి చెందిన ఓట్లు , మరో 14 తొలగించాల్సిన ఓట్లు పెండింగు లో ఉన్నట్లు తెలిపారు. నవంబర్ 16 నుంచి 22 వరకు నియోజక వర్గ ఓట్ల నమోదు అధికారికి బూత్ వారీగా లక్ష్యం నిర్దేశించడం జరిగిందని మాధవీలత తెలియ చేశారు. వీటిలో కొవ్వూరు కి చెందినవి 398, నిడదవోలు కి చెందినవి 351 ఉన్నట్లు తెలిపారు. బూత్ వారీగా బీఏల్వో లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఎలెక్టోరల్ పాపులేషన్ , జెండర్ రేషీయో , 18-19 , 20-29 మధ్య 5వయస్సు ఉన్న ఓటర్ల గుర్తింపు నమోదు కోసం కాలేజీల స్థాయిలో అవగాహన కలుగచేసే స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. జనాభా లెక్కల ప్రకారం యువ ఓటర్ల గుర్తింపు, ఓటర్లుగా నమోదు చేసేందుకు అవసరమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అక్టోబర్ 27 న ప్రచురించిన నమూనా ఓటర్ల జాబితా మార్పులు చేర్పులు చేసే విధానం లో అదనంగా 8651 ఓట్లు నమోదు చేయగా, 3382 ఓట్ల ను తొలగించడం జరిగిందన్నారు. డిసెంబర్ 2 ,3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు మార్పులు చేర్పులు బూత్ స్థాయి లో చేపట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News