Breaking News

సంయుక్త బ్యాంకు ఖాతాలు తప్పనిసరి

రాజమహేంద్రవరం,  నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జగనన్న విద్యాదీవెన పధకం కోసం లబ్దిదారులందరూ బ్యాంకు ఖాతాలను తల్లిపేరుతో సంయుక్త బ్యాంక్ ఖాతాలు తప్పని సారి ఈ నెల 24వ తేదీ లోగా మార్చుకోవాలని సాంఘీక సంక్షేమ శాఖ అధికారి యం సందీప్ గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఇప్పటి వరకు పథక ఆర్థిక లబ్దిని తల్లుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారని, ఇకపై పథకం కింద లబ్ది పొందుతున్న విద్యార్ధులు తమ తల్లితోపాటు ఖాతా తెరవాల్సి ఉందన్నారు. కొత్తగా ప్రారంభించే ఖాతాలో విద్యార్థి ప్రాధమిక ఖాతాదారుగా, తల్లి ద్వితీయ ఖాతాదారుగా ఉండాలని వివరించారు. షెడ్యూల్డ్ కులాల విద్యార్ధులు, 2023 -24 విద్యా సంవత్సరంలో చివరి సంవత్సరం చదువుతున్న అన్ని కేటగిరీల విద్యా ర్ధులకు ఉమ్మడి ఖాతా అవసరం. లేదని స్పష్టం చేశారు. ఈ నెల 24వ తేదీలోగా సంయుక్త బ్యాంకు ఖాతాలను తెరవాలని, తెరచిన ఖాతా వివరాలను గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో సంక్షేమ మరియు విద్యా సహాయకులకు అందజేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *