రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ . గంధం సునీత వారు రానున్న జాతీయ లోక్ అదాలత్ దృష్ట్యా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తూర్పు గోదావరి జిల్లా లోని బార్ అసోసియేషన్ అధ్యక్షులతో సమావేశం అయ్యారు. డిసెంబరు 9వ తేదీన జరగనున్న జాతీయ లోక్ అదాలత్ నందు ఉమ్మడి జిల్లాలో ఉన్న అన్ని న్యాయస్థానాలలో పెండింగ్ లో ఉన్న అన్ని రకాల సివిల్ కేసులు, క్రిమినల్ కేసులు, ప్రీ-లిటిగేషన్ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అదనపు జిల్లా న్యాయస్థానాలలో మోటారు వాహనాల యాక్సిడెంట్ కేసులను పరిష్కరించి బాధితు లకు పరిహారం అందించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. వీటితో పాటు భూ వివాదాలు, ఆస్తి వివాదాలు, రెవెన్యూ కేసులు, మునిసిపాలిటీ కేసులు మరియు రాజీ పడదగిన అన్ని ఇతర కేసులను పరిష్కరించేందుకు పలు సూచనలు చేశారు. సీనియర్ సివిల్ జడ్జి, డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి కే. ప్రత్యూష కుమారీ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News