Breaking News

జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు

– 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు కావాలి
– ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే ఆయుధం
– ఓటరుగా నమోదు కై ఎన్నికల కమిషన్ ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
– జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా ఓటర్ నమోదు పై “స్వీప్” అవగాహన కార్యక్రమం
-కమిషనర్ కే దినేష్ కుమార్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటరుగా నమోదు కై ఎన్నికల కమిషన్ ఇచ్చిన సదావకాశం యువత సద్వినియోగం చేసుకోవాలని, 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా తప్పని సరిగా నమోదు కావాలని నగరపాలక సంస్థ కమిషనర్ కే.దినేష్ పిలుపు నిచ్చారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా గురువారం స్థానిక నగర పాలక సంస్థ కార్యాలయంలో ఓటర్ నమోదు “స్వీప్” కార్యక్రమం పై నగర పాలక సంస్థ కమిషనర్ కె. దినేష్ కుమార్ మీడియాతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులతో నగరపాలక సంస్థ కమిషనర్ కే దినేష్ కుమార్ మాట్లాడుతూ నైతిక విలువలతో కూడిన ఓటింగ్ వైపు పయనించేలా ఓటర్లను చైతన్య పరచడం మరియు భాగస్వామ్యం చేయడం ” స్వీప్ ” ముఖ్య ఉద్దేశ్యమన్నారు.. నియోజక వర్గంలో 2024 జనవరి 1 నాటికి ఓటు హక్కు లేని ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాల్సి ఉందన్నారు. అందులో భాగంగా ప్రజలలో విస్తృత అవగాహన కొరకు  స్వీప్ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా 18 ఏళ్లు నిండే యువత ప్రతి ఒక్కరు భావి ఓటరు గా నమోదు కావాలని అందు కోసం ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఫారం- 6ఏ ద్వారా భారతీయ పాస్ పోర్ట్ కలిగిన విదేశాల్లోని భారతీయుల ఓటు నమోదు కొరకు, ఫారం – 6బి ఓటరు కార్డును మీ యొక్క ఆధార్ కార్డుకు అనుసంధానం చేయుట కొరకు, ఫారం -7 ద్వారా చనిపోయిన వ్యక్తుల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించుకోవడం కోసం, ఫారం – 8 ద్వారా చిరునామా, నియోజక వర్గాల మార్పు చెందిన వారికి ధరకాస్తు చేసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. మరింత సమచారం సహాయం కోసం టోల్ ఫ్రీ నంబరు1950 కు డయల్ చేయవచ్చునని అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని మీడియా ద్వారా యువతకు ఓటు నమోదు పై విస్తృత స్థాయిలో ప్రచారం కల్పించాలన్నారు. రాజమహేంద్రవరం పట్టణ నియోజక వర్గంలో 2,56,000 వేలకు పైగా ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. స్పెషల్ సమ్మరీ రివిజన్ లో భాగంగా సుమారు 60 వేల దరఖాస్తులు రావడం జరిగిందన్నారు. ప్రతి బూత్ స్థాయి బి.ఎల్.వో వద్ద నమోదు ఫారాలు సంబంధిత మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియ ఆన్లైన్ లో కూడా చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. డిసెంబర్ 9 వరకు స్వీప్ అవగాహన కార్యక్రమం కొనసాగిస్తా మన్నారు. అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరు ఓటు లేకుండా ఉండకూడదని ఉద్దేశ్యం శాశ్వత కియోస్కి లను నగరంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రద్దీ ఉండే ప్రాంతాల్లో పుష్కర్ ఘాట్, ఈట్ స్ట్రీట్, ఆర్టీసీ బస్టాండ్, కంబాల చెరువు, తదితర ముఖ్య కూడళ్ళలో రెండు రోజుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్పులు చేర్పులు కి చెందిన ఎటువంటి అభ్యoతరాలైన ఈ ఆర్ వో లేదా బి ఎల్ వో దృష్టికి తీసుకుని రావచ్చునని దినేష్ కుమార్ తెలియ చేశారు ఈ కార్యక్రమంలో ఆర్ ఏం సి హెల్త్ అధికారి డా వి. వినూత్న, తహశీల్దార్ సుస్వాగతం, పాత్రికేయులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *