– పాల్గొననున్న మేధావి వర్గం , కుల సంఘాల నేతలు
– హోటల్ మంజీరా లో సా 3 నుంచి 5 గంటల వరకు సమావేశం
– తూ.గో. జిల్లా కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉభయ గోదావరి జిల్లాల మేధావి వర్గం, కుల సంఘాల నాయకులు తో రాజమహేంద్రవరం లో కులగణన పై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు ప్రాంతీయ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. కలెక్టర్ మాధవీలత గురువారం వివరాలు తెలియ చేస్తూ నవంబర్ 17 వ తేదీ శుక్రవారం రాజమహేంద్రవరం లో నిర్వహిస్తున్న కుల గణన కు సంబందించిన ఆసక్తి ఉన్న మేధావి వర్గం, కుల సంఘాల ప్రతినిధులు నుంచి విలువైన సూచనలు సలహాలు, ప్రతిపాదనలు కోసం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్. శ్రీనివాస్ వేణుగోపాల కృష్ణ, పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్, శాసన మండలి , శాసన సభ్యులు, మేధావి వర్గం ప్రతినిధులు , వివిధ కుల సంఘాల చైర్మన్లు, సభ్యులు, ప్రతినిధులు తదితరులు పాల్గొన నున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సమావేశంలో ప్రసంగించే వాళ్ళు పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశం స్థానిక హోటల్ మంజీరా నందు నవంబర్ 17 శుక్రవారం మ.3 గంటలకు నిర్వహిస్తున్నట్లు, ఆమేరకు వక్తలు అరగంట ముందుగా వారికి కేటాయించిన సీట్ల లో ఆశినులు కావాలని కలెక్టర్ పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News