-జిల్లాలో 2023 లో నాలుగు విడతల్లో 1622 మందికి రూ.12.18 కోట్ల లబ్ది
-4వ విడతలో జిల్లాకు చెందిన 315 మంది లబ్ధిదారులకు రూ.2,35,85,000 ప్రయోజనం
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, తేది.23.11.2023
జిల్లాలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడతలో అర్హులైన వధువు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసే క్రమంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యాంగులు, భవన ఇతర నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకం కింద జిల్లాకు చెందిన 315 మంది లబ్దిదారుల జంటలకు రూ.2,35,85,000 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేయ్యాడం జరిగిందని జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీ లత పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గురువారం ఉదయం తాడేపల్లి లోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా 4వ విడత ఆర్థిక ప్రయోజనాన్ని లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలకు విడుదల చేశారు. స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్, ఎంపి మార్గాని భరత్ రామ్ లబ్దిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, పేద, నిరుపేద కుటుంబాలకు చెందిన వారికి వివాహ సమయంలో ఆసరాగా నిలిచేందుకు కళ్యాణ మస్తు, షాధి తోఫా కింద ఆర్థిక సహాయం అందించడం జరుగుతోందని అన్నారు. 2023 లో గత నాలుగు విడతల్లో జిల్లాకు చెందిన 1622 మంది లబ్ధిదారులకు సుమారు రూ.12 కోట్ల 18 లక్షలు వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు. ఫిబ్రవరి నెలలో తొలి విడత గా 108 మంది జంటలకు కి రూ.91.05 లక్షలు, మే నెలలో రెండో విడతలో 522 మందికి రూ.3.82 కోట్లు, ఆగస్ట్ నెలలో 3 వ విడతలో 677 మందికి రూ.5 కోట్ల 8 లక్షల 35 వేలు జమ చెయ్యడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో నాల్గవ విడత క్రింద 315 మంది కి రు.235.75 లక్షలు లబ్ధిదారుల ఖాతాలకు జమచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. యంపి. మార్గాని భరత్ రామ్ మాట్లాడుతూ పేద తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించి, వారి వివాహాన్ని గౌరవ ప్రదంగా జరిపించే తమ సామాజిక బాధ్యత నిర్వర్తించేందుకు అండగా నిలుస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు” ద్వారా, మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు “వైఎస్సార్ షాదీ తోఫా” ద్వారా ఆర్థిక సాయం జగనన్న ప్రభుత్వం అందజేస్తుందన్నారు. వైఎస్సార్ కళ్యాణమస్తు / వైఎస్సార్ షాదీ తోఫా పథకం ప్రారంభం నుండి ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం పూర్తయిన వెంటనే చెల్లిస్తూ, ఇప్పుడు అందిస్తున్న సాయంతో కలిపి, ఇప్పటి వరకు 3. 348.84 కోట్ల రూపాయలను 46,062 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన జగనన్న ప్రభుత్వం జమ చేసిందన్నారు. జూలై-సెప్టెంబర్, 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 10,511 జంటలకు “వైఎస్సార్ కళ్యాణమస్తు”, “వైఎస్సార్ షాప్ తోఫా” క్రింద రూ. 81.64 కోట్ల ఆర్థిక సాయాన్ని వధువుల తల్లుల ఖాతాల్లో ముఖ్యమంత్రి . వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి జమ చేసారని పేర్కొన్నారు.
కేటగిరీ వారీగా 4వ విడత లబ్దిదారులు:
ఎస్సీలకు రు.1 లక్ష చొప్పున 118 మందికి రూ. 118 లక్షలు, ఎస్సీ లను కులాంతర వివాహాలు చేసుకున్న ఐదుగురు లబ్దిదారులకు రు.1.20 లక్షలు చొప్పున రూ .6 లక్షలు, బీసీలకు 159 మంది లబ్దిదారులకు రు.50 వేల రూపాయలు చొప్పున 81.51 లక్షల రుపాయలు, బీసీ కులాంతర వివాహాలు చేసుకున్న 21 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికి రూ.75 వేలు చొప్పున రూ.15.75 లక్షలు, మైనార్టీలకు ఒక్కోక్కరికీ రూ.1 లక్ష చొప్పున 4 గురుకి రూ.4 లక్షలు, మైనార్టీ కులాంతర వివాహాలు చేసుకున్న లబ్దిదారులకు రూ .1.20 లక్షలు చొప్పున ఒకరికీ రూ. 1.20 లక్షలు, దివ్యాంగుల లబ్దిదారులకు రు.1.50 లక్షల చొప్పున 6 గురు లబ్దిదారులకు రూ.9 లక్షలు, భవన నిర్మాణ కార్మికుల కేటగిరీలో ఒకరికి రూ. 40 వేల రుపాయలు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జి డి ఆర్డీఏ పి. వీణా దేవి, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎస్ జ్యోతి, రుడా మాజీ ఛైర్ పర్సన్ ఎమ్. షర్మిలా రెడ్డి, ఇతర అధికారులు లబ్దిదార జంటలు పాల్గొన్నాయి.
Prajavartha Online Telugu News