రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో శిక్షణా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో ట్రైనీ డీఎస్పీ జీ. భానోదయ జిల్లా కలెక్టర్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. డి ఎస్పీ గా నియామకం పొందిన విశాఖపట్నంకు చెందిన జె. భానో దయ శిక్షణ కోసం తూర్పు గోదావరి జిల్లాకు రావడం జరిగింది. డిఎస్పీ గా ఎంపిక అవ్వడం అనంతరం జిల్లాలో శిక్షణా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News