Breaking News

కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26 న ఆమోదించిన రోజును ప్రతి ఏడాది రాజ్యాంగ పీఠిక చదవడం ద్వారా రాజ్యాంగం యొక్క విలువలను తెలుసుకొని , వాటిని ప్రతి ఒక్క పౌరుడు గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం కలెక్టరేట్ లో రాజ్యాంగ దినోత్సవం ను నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ, భారత రత్న డా బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రచన కమిటీ చైర్మన్ గా ముసాయిదా రూపొందించి ఆమోదింపబడిన రోజును ప్రతీ ఏడాది రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నా మన్నారు. అందరికీ సమ న్యాయం, సమాన హక్కులు , అందరీ వ్యక్తిత్వాలు గౌరవించే విధంగా రాజ్యాంగ రచన చెయ్యడం జరిగిందన్నారు. జాతీయ ఐక్యతను చాటుకునే విధంగా రాజ్యాంగ రూపుదిద్దుకుందని, ప్రతీ ఒక్కరు రాజ్యాంగం కల్పించిన అవకాశాలు మననం చేసుకోవడం జరుగుతోందని అన్నారు . ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ (పౌర సరఫరాల) ఎ. కుమార్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారిణి కె యస్. జ్యోతి, ఇతర శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *