రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు రుడా కార్యాలయం లో ఆదివారం ఉదయం రుడా వైస్ చైర్ పర్సన్ బి.బాల స్వామి ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. తొలుత డాక్టర్ అంబేద్కర్ గారికి మరియు గాంధీ గారికి పూలమాలలు వేసి, భారత రాజ్యాంగ ప్రవేశికను రుడా అధికారులు, సిబ్బంది తో కలిసి చదివి రాజ్యాంగదినోత్సవ కార్యక్రమమునకు ఘనంగా నిర్వహించారు. తదుపరి విసి బి. బాల స్వామి మాట్లాడుతూ భారత రాజ్యాంగం దేశంలోని ప్రతి పౌరునికి స్వతంత్ర భారతదేశంలో జీవించడానికి సమాన హక్కులను కల్పించిందన్నారు. ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశ్యం రాజ్యాంగ విలువలను తెలుసుకోవడం , ఆచరణ కోసం దేశంలోని యువతలో అవగాహన కల్పించడానికి అని వివరించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముఖ్య పాత్ర పోషించారాని, నవంబర్ 26 న నేషనల్ లా డే అని కూడా అంటారని తెలియపరిచారు. రాజ్యాంగం ప్రధాన ఉద్దేశ్యం దేశంలో నివసించే అన్ని మతాల ప్రజల మధ్య ఐక్యత, సమానత్వం ఉండాలని, వివక్ష లేకుండా ప్రజలందరూ హక్కులు పొందేలా రాజ్యాంగాన్ని రూపొందించా రన్నారని, భారత రాజ్యాంగంలో ప్రవేశిక వ్రాయబడిందని, దీనిని భారత రాజ్యాంగ పరిచయ లేఖ అని పిలుస్తారని, ఈ ఉపోద్ఘాతం లో ఇది భారతదేశంలోని పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం ప్రజల మధ్య సోదరభావాన్ని ప్రోత్సహిస్తుందని తెలియపరిచారు. ఈ కార్యక్రమం లో రుడా సెక్రటరీ జి. శైలజవల్లి, రుడా ప్లానింగ్ ఆఫీసర్ ఎన్.శ్రీనివాస్, రుడా ఇ. ఇ. జి. నాగేశ్వరి, రుడాఎ.పి.ఒ ఎం. అనిత, రుడ జె.పి.ఒ లు ఆర్. వి. కోటేశ్వరరావు, లక్ష్మి జ్యోతి మరియు రుడా ఆఫీస్ సిబ్బంది పాల్గున్నారు.
Prajavartha Online Telugu News