-తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత పేరుతో అర్బన్ తహశీల్దార్ కి సందేశం
– రాజమహేంద్రవరం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
– సమాజంలో జరుగుతున్న ఇటువంటి ఘటన పై ప్రజల్లో అవగాహన పెంచాలి
– కలెక్టర్ కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరగాళ్ల మోసాలు పెరుగుతున్నాయని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా సందేశాలు పంపుతూ ప్రజలను, అధికారులు మోసగిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తూర్పు గోదావరి జిల్లా మెజిస్ట్రేట్ మరియు కలెక్టర్ డా కే. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలియచేశారు. వాస్తవ పరిస్థితిని తెలియచేస్తూ…. రాజమహేంద్రవరం అర్బన్ తహశీల్దార్ వారికి జిల్లా కలెక్టర్, తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం డా కె. మాధవీలత వారి యొక్క గుర్తింపు మరియు హోదా తో ఫోన్ నంబర్ 6203893287 ద్వారా తన సమీప బంధువు కి యాక్సిడెంట్ అయిందని కోసం రూ.50 వేలు 9735913429కి ఫోన్ పే చేసి సదరు స్క్రీన్ షాట్ పంపాలని కోరినట్లు సందేశం వొచ్చిందన్నారు. అనుమానం వచ్చి వాకబు చెయ్యగా ఇది హెకర్స్ పనిగా గుర్తించడం జరిగిందన్నారు. వెంటనే 2వ పట్టణ పోలీసు స్టేషన్ లో సమగ్ర సమాచారం ఇచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. వాట్స్ యాప్ కాల్స్ మరియు సందేశాలు వచ్చాయని తహశీల్దార్ వి. సుస్వాగతం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సైబర్ నేరాల కింద ఫిర్యాదు నమోదు చేయండం జరిగింది. కలెక్టర్ల , అధికారుల , బంధువుల ఫొటోలను దుర్వినియోగం చేసి కొందరు గుర్తుతెలియని దుండగులు ఇలా మోసం చేసే ఉద్దేశంతో వాట్సాప్‌లో మెసేజ్‌లు, కాల్స్‌లు పంపుతున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఇదే తరహాలో అధికారులను మరియు సామాన్య ప్రజలను మోసం చేసే ఆస్కారం ఉంది. అందుకే సదరు వ్యక్తిపై అవసరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసి వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కలెక్టర్ విజ్ఞప్తి: సామాజిక మాధ్యమాల పట్ల వాటి ద్వారా అందే సందేశాలు (ఎస్ ఎమ్ ఎస్,) పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలని మాధవీలత తెలియచేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు, అధికారులు పూర్తి జాగ్రత్తగా ఉండాలని, సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అటువంటి సందేశాలు వొస్తే వెంటనే వాటి వివరాలు పోలీసులకు , సైబర్ క్రైమ్ బ్రాంచ్ అధికారులకు సమాచారం అందచేయాలని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. ఇటువంటి వారి ఉచ్చులో పడి మోస పోవద్దని స్పష్టం చేశారు, బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఇటువంటి మోసాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించే విధంగా అడుగులు వేయడం ముఖ్యం అని తెలియ చేశారు.
Prajavartha Online Telugu News