రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాల లో ఆదివారం “76 వ ఎన్ సీ సీ ” ఆవిర్భావ వేడుకలు ఘనం గా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రామచంద్ర ఆర్ కె తెలిపారు. కళాశాల సెమినార్ హాల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆర్ జే డీ డాక్టర్ సి కృష్ణ మాట్లడుతూ ఎన్ సీ సీ క్రమశిక్షణ కల్గిన, ప్రపంచం లోనే యూనిఫాం వేసుకొని సేవ చేసే అతిపెద్ద వాలంటీర్ వ్యవస్థ అని దేశం లో సుమారు 15 లక్షల విద్యార్థులు ఎన్ సీ సీ కాడెట్ లు గా ఉన్నారన్నారు. క్రమశిక్షణ తో పాటు, వ్యక్తిత్వ వికాసం, సామాజిక స్పృహ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తి వంటి గుణాలు అలబడుతాయని తెలిపారు. ఈ సందర్భంగా తలసైనిక్ క్యాంప్ లో పాల్గొన్న విద్యార్థులను అదేవిధంగా కళాశాల లో ప్రతిభ చూపిన ఇతర కాడెట్లకు ఉత్తమ కాడెట్లు గా పతకాలను అందించారు. కళాశాల లో రాజ్యాంగ దినోత్సవ వేడుకలలో పాల్గొనటానికి విచ్చేసిన జిల్లా ప్రధాన న్యాయమూర్తులు శ్రీమతి సునీత గంధం, న్యాయమూర్తులు ఎం మాధురి, కే ప్రత్యూష కుమారి లు ఎన్ సీ సీ విద్యార్థుల ప్రతిభా పాటవాలు చూసి ప్రత్యేకం గా ప్రశంసించారు. కార్యక్రమంలో కళాశాల ఎన్ సీ సీ అధికారి లెఫ్టినెంట్ ఈసుబ్ బాషా షేక్, కేర్ టేకర్ అనూష ఎన్ సీ సీ కేడెట్లు పాల్గొన్నారు. కార్యక్రమం లో జిల్లా న్యాయమూర్తులతో కలిసి రాజ్యాంగ విలువలను తెలియచేసే విధంగా నినాదాలిస్తూ శాంతియుత ర్యాలీ ని కళాశాల నుండి వై జంక్షన్ మీదుగా నిర్వహించడం జరిగింది.
Prajavartha Online Telugu News