– ప్రభుత్వం యువ న్యాయవాదులకు తొలి మూడు సంవత్సరాలు అండగా ఉంటూ, ఆర్ధికంగా భరోసాను కల్పిస్తుంది..
– కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
క్రొత్తగా న్యాయవాద వృత్తిలో ప్రవేశించిన యువ న్యాయవాదులకు, వారి వృత్తిలో స్థిరపడే వరకు మొదటి మూడు సంవత్సరాల పాటు నెలకు రూ.5 వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని జిల్లా కలెక్టర్ డా. కె.మాధవీలత పేర్కొన్నారు. సోమవారం ఉదయం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెలగపూడి సిఎం క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో “జగనన్న లా నేస్తం” కార్యక్రమం ప్రారంభించగా, స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేమందిరం నుంచి జిల్లాలో స్థాయి ” వైఎస్ఆర్ లా నేస్తం” కార్యక్రమంలో కలెక్టర్ మాధవీలత, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, పాల్గొన్నారు. అనంతరం చెక్కును లబ్ధిదారులకు అందచేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ డా.మాధవీలత మాట్లాడుతూ 2023-24 ఏడాదికి సంబందించి రెండవ విడతగా జిల్లాలోని 844 మంది న్యాయ వాదులు 6 నెలలకు చెంది రూ.42.20 లక్షల ఆర్థిక ప్రయోజనాన్ని వారి ఖాతాలకు జమ చెయ్యడం జరిగిందన్నారు. వీరిలో జిల్లాకు చెందిన 189 మంది ఎస్సీ లు, 307 మంది బిసి లు, 324 మంది ఓసి లు, 24 మంది ఎస్టీ లకు “జగనన్న లా నేస్తం” కింద ప్రయోజనం చేకూరడం జరిగిందని కలెక్టరు తెలిపారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా “వైఎస్సార్ లా నేస్తం” యువ న్యాయవాదులకు తొలి 3 సంవత్సరాలు అండగా ఉంటూ ఆర్ధిక భరోసా ను ఇస్తుందని జిల్లా డీసీసీబి చైర్మన్ ఆకుల వీర్రాజు అన్నారు. 2023-24 సంవత్సరానికి గాను రెండో విడత వైఎస్సార్ లా నేస్తం క్రింద రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులైన జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ. 5 వేల రూపాయలు చొప్పున స్టెఫండ్ 2023 జులై నుంచి డిసెంబర్ వరకు 6 నెలల కు సంబంధించి ఒక్కొక్కరికి రూ. 30 వేల రూపాయలు చొప్పున మొత్తం రూ. 7.99 కోట్ల రూపాయలను నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారని తెలిపారు. నేడు అందిస్తున్న సాయంతో కలిపి ఇప్పటివరకు 6,069 మంది యువ న్యాయవాదులకు ఈ నాలుగున్నరేళ్లలో మొత్తం రూ. 49.51 కోట్లు ఆర్థిక సాయం అందించడం జరిగిందన్నారు. న్యాయవాదుల స్పందన: కడియం మండలం కడియం .. యువ న్యాయవాది అయితంరెడ్డి శిరీష గ్రామానికి చెందిన యువ న్యాయవాది అయితంరెడ్డి శిరీష మాట్లాడుతూ వైయస్ఆర్ లా నేస్తం కింద అందచేస్తున్న రు.5 వేల స్టైఫండ్ ఎంతో ఉపయోగం పడుతుందని అన్నారు. ఈ పథకం ద్వారా ఆరు మాసాలుకు సంబందించి ఒకేసారి రూ. 30 వేలు రూపాయలు మా ఎకౌంట్ జమ కావడం వాటిని సద్వినియోగం చేసుకుంటున్నాము. ఎగ్జామ్స్ , ఎఎల్ఎల్ యం, లైబ్రరీ ఖర్చులకు ఎంతోగానో ఉపయోపడుతుందన్నారు. కొత్తలో ఎటువంటి ఆదాయం ఉండదని ఈ సమయంలో ఈసొమ్ము ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. మాకు ఆర్థిక చేయూతనిస్తున్న సిఎం జగన్ మోహన్ రెడ్డి కి మా యువ న్యాయవాదుల తరపున కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నట్లు అయితం శిరీష్ పేర్కొన్నారు. యువ న్యాయవాది..అడపా మణికంఠ.. నేపేరు అడపా మణి కఠ నేను లా పూర్తి చేసి ప్రస్తుతం జిల్లా కోర్టులో అప్రంటీస్గా చేస్తున్నాను. వైయస్ఆర్ లా నేస్తం మాలాంటి యువ న్యాయవాద వృత్తిలోకి వస్తున్న మావంటి యువతను ఎంతో ఉపయోగ పడుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. అందులో భాగంగా మాలాంటి యువ న్యాయవాదులను కూడా గుర్తిం మాకు ఆర్థిక చేయుత నివ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఆరు మాసాలు ఒక సారి సొమ్మ వేయడం వలన ఎంతో ఉపయోగ పడుతుందని రాజమహేంద్రవరం అర్బన్ కు చెందిన యువ న్యాయవాది అడపా మణికంఠ తన అభప్రాయం తెలిపారు. యువ న్యాయవాది శేసెట్టి వీర మణికంఠ రాజమహేంద్రవరంకు చెందిన యువ న్యాయవాది శేసెట్టి వీర్రా మణికంఠ మాట్లాడుతూ నేను లా వృత్తిని చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వం లా నేస్తం ద్వారా ఇప్పటి వరకు రూ.85 వేల రూపాయలు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది రెండవ విడతలో ఆరు మాసాలకు సంబందించి రూ.30 వేల రూపాలు జమ చేసారన్నారు. యువ న్యాయవాది వృత్తి తొలి దశలో ఉన్న మా ఇబ్బందులను గుర్తించి సీయం జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న ఈ ఆర్థిక సహాయం మా ఎదుగుదలకు ఎంతో ఉపయోగ పడుతుందని వారు సంతోషాన్ని తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు,వైఎస్ఆర్ సీపీ లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ డి వి వి త్రినాద్,కార్యదర్శిపి వివిఎస్బి రాజు, పట్టణ ప్రెసిడెంట్ సుమన్ పాల్, హితకారిని సమాజ్ చైర్మన్ కె. మణికుమారి, కొవ్వూరు టౌన్ లీగల్ సెల్ ప్రెసిడెంట్ కె. గోపాలా కృష్ణ , పలువురు న్యాయవాదులు, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News