రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రులలో నిబద్దతతో సేవలు అందించే సేవా మిత్రాలకు రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో నవంబర్ నెలలో మెరుగైన ఆరోగ్య మిత్రా గా గోకవరం సామాజిక ఆరోగ్య కేంద్రం (సిహెచ్సీ) కి చెందిన సేవా మిత్రా డి. కాశీ విశ్వనాధ్ కి కలెక్టర్ చేతుల మీదుగా ఆగస్టు మాసానికి సంబందించి రూ.5 వేల నగదు పురస్కారం చెక్కును సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఒక్క నెట్ వర్క్ ఆసుపత్రిలో పనిచేసే ఆరోగ్య సేవా మిత్రా తమ విధులను బాధ్యతతో నిర్వర్తించాలని కోరారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పనిచేసే ఆరోగ్య మిత్రాలు వైద్య సేవల కోసం వచ్చే రోగుల వివరాలు ఆరోగ్యశ్రీ కింద నమోదు చెయ్యడం ద్వారా ఆయా ఆసుపత్రుల అభివృద్ధి కోసం కూడా తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, జిల్లా ఆసుపత్రుల కో-ఆర్డినేటర్ డా పి. ప్రియాంక , డి ఎమ్ హెచ్ ఓ డా కే. వేంకటేశ్వర రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News