రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో డిసెంబర్ నెలలో సంభవించిన మిచౌoగ్ తూఫాన్ కారణంగా అధిక వర్షాలు మరియు ఈదురు గాలుల వలన నష్ట పోయిన వ్యవసాయ పంటలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారము పంట నష్టాన్ని అంచనా వేయుటకు గ్రామ, మండల మరియు డివిజినల్ స్థాయి లో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగినదని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామ స్థాయి కమిటీ లో గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, రెవిన్యూ ఇన్స్పెక్టర్, గ్రామా రెవిన్యూ అధికారి, పంచాయితీ కార్యదర్శి మరియు గ్రామ వ్యవసాయ సహాయకులను నియమించామన్నారు. మండల స్థాయి కమిటీ లో మండల ప్రత్యేకాధికారి, తహశీల్దార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మరియు మండల వ్యవసాయ అధికారి ని నియమించామన్నారు. డివిజన్ స్థాయిలో రెవెన్యూ డివిజినల్ అధికారి మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు (రెగ్యులర్ ) వారిని నియమించామన్నారు. పై స్థాయిలలో పంట నష్టం అంచనా వేసిన నివేదిక మరియు జాబితాలను సమర్పించుటకు గడువు తేదీలు: పంట నష్టం అంచనా వేయుటకు ఆఖరు తేదీ : 18.12.2023 సామాజిక తనిఖీ (Social audit ) కొరకు RBKల వద్ద జాబితా ప్రదర్శించవలసిన తేదీలు : 18.12.2023 నుండి 22.12.2023 వరకు జిల్లా వ్యవసాయ అధికారి వారి కార్యాలయానికి జాబితాలను సమర్పించుటకు ఆఖరు తేదీ : 23.12.2023 సదరు వివరాలతో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయానికి తుది జాబితాలను వ్యవసాయ శాఖ ద్వారా సమర్పించుటకు ఆఖరు తేదీ : 24.12.2023 గా నిర్ణయించడం జరిగిందన్నారు. కావున జిల్లాలోని రైతులందరూ మిచౌoగ్ తూఫాన్ వలన నష్ట పోయిన పంటలను ప్రభుత్వ నిబంధనల ప్రకారము 33% కంటే ఎక్కువ నష్టము మరియు ఈ – పంట లో నమోదు చేయించకున్న పంటలను, గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించి అంచనా వేయించుకోగలరు. రబీ పంట కాలములో తుఫాన్ కారణంగా పాడైపోయిన వరి నారుమడులకు మరియు నష్ట పోయిన శనగ పంటలకు విత్తనాల కొరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
Prajavartha Online Telugu News