Breaking News

ఈస్ట్ ఇజ్ బెస్ట్ అనే విధంగా మున్ముందు మరింత సమన్వయంతో పని చేద్దాం

-పని వత్తిడిని అధిగమించేందుకు కార్తీక వన మహోత్సవం కార్యక్రమం అధికారుల్లో స్పూర్తి నింపింది.
-త్వరలో ఇంటర్ డిపార్ట్మెంట్ క్రీడల నిర్వహణ కు కార్యాచరణ
– జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కొత్త జిల్లా ఏర్పాటు అయి 18 నెలల వ్యవధిలో ఎన్నో సవాళ్ళను కలిసి కట్టుగా పనిచేసి జిల్లాకు మంచిపేరు తీసుకుని రావడంలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అభినందనీయం అని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పుష్కరవనం లో తూర్పు గోదావరి జిల్లా అధికారుల కార్తీక వన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, నిత్యం పని వత్తిడిలో ఉండే ఉద్యోగుల్లో మరింత ఉత్సాహాన్ని నింపే ప్రయత్నంలో భాగంగా నిర్వహించిన కార్తీక వన సమారాధన లో అధికారులు, అన్ని స్థాయిల్లోని సిబ్బంది పాల్గొని వారి ప్రతిభ కనబరిచిన తీరు ప్రశంసనీయం అన్నారు. తొలి నాళ్లలో కలెక్టరేట్ ఏర్పాటు సమయంలో ఎదుర్కొన్న సవాళ్ళను అధిగమించడం ద్వారా నేడు కలెక్టరేట్ కు ఇతర జిల్లా స్థాయి కార్యాలయాలకు ఒక రూపు తీసుకుని రావడం జరిగిందన్నారు. మరింతగా అధికారుల్లో స్ఫూర్తి నింపే ప్రయత్నంలో ఇటువంటి సామూహిక కలయికల వల్ల అంతా ఒకటే అనే భావన కలుగుతుందని కలెక్టర్ అన్నారు. రానున్న రోజుల్లో జిల్లా లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బందితో కలిసి క్రీడా పోటీలను నిర్వహించనున్నట్లు ఇందుకు జాయిన్ కలెక్టర్ తేజ్ భరత్ నేతృత్వం లో కోర్ కమిటీ వేసి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు మాధవీలత పేర్కొన్నారు. పురుషులు, మహిళా విభాగాల్లో పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏ ఏ క్రీడాంశాల్లో పోటీలను జరపాలో, ఏ ఏ శాఖలను కలిపి బృందాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీసు విభాగం కూడా ఇందులో పాల్గొనాల్సి ఉందన్నారు ఆద్యాంతం క్రీడలను తిలకించిన కలెక్టరు మాధవీలత అధికారులు, సిబ్బందిలోను ఉత్సాహాన్ని నింపి ప్రోత్సహించారు. ఈ వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా కలెక్టరు, జేసీ,మున్సిపల్ కమీషనర్, ఎస్సీ క్రికెట్ ఆడడం, అనతంరం స్టార్ గేమ్ లో అంతే ఉత్సాహంతో వీరందరూ పాల్గొని అధికారుల్లో, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపడం విశేషం. ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ, జిల్లా కలెక్టర్ చోరవతో ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు. జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, ఆర్డీవోలు ఏ. చైత్ర వర్షిణి, కృష్ణ నాయక్, పర్యాటక శాఖ ఆర్ డి.. వి. స్వామి నాయుడు , ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు పి. సువర్ణ, ఎమ్. భాను ప్రకాష్, ఇతర జిల్లా అధికారులు, మహిళా అధికారులు కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు. వన మహోత్సవ వేడుకల్లో సందర్భంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో అధికారులు, ముఖ్యంగా మహిళా అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. తొలుత జిల్లా కలెక్టర్ మాధవీలత ఉసిరి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. వేడుకల అనంతరం పోటీల్లో పాల్గొన్న విజేతలకు, సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చిన చిన్నారులకు, ఆర్కెస్ట్రా బృంద సభ్యులకు బహుమతులు అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *