రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా ఎన్ వి వి ఎస్ మూర్తి పదవీ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఆదివారం జిల్లా కలెక్టర్ మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి జాయినింగ్ రిపోర్టు అందచేశారు. 2007 లో గ్రూప్ వన్ అధికారిగా ఎంపికై తొలిసారిగా పూర్వపు తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం లో మండల అభివృద్ధి అధికారిగా ప్రభుత్వ సర్వీస్ లో జాయిన్ అవ్వడం జరిగింది. తదుపరి కడియం, రాయవరం, రాజానగరం ఎంపీడీవో గా పదవీ బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం కాకినాడ జెడ్పీ కార్యాలయం పరిపాలన అధికారిగా 2022 నవంబర్ నుంచి పని చేయుచున్నారు. ఇటీవల ప్రభుత్వం కల్పించిన పదోన్నతుల లో భాగంగా డివిజనల్ అభివృద్ధి అధికారిగా పదోన్నతి పొందడం జరిగింది. ,ప్రస్తుతం రాజమహేంద్రవరం , తూర్పు గోదావరి జిల్లాకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా ప్రభుత్వం నియమించిన దృష్ట్యా ఎన్ వివి ఎస్ మూర్తి పదవీ బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మూర్తి కి అభినందనలు తెలిపారు.
Prajavartha Online Telugu News