– వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకు”ఆడుదాం ఆంధ్రా” 5 కే రన్
-ఎంపీ మార్గాని భరత్ రామ్
-ఇంచార్జి జేసీ , కమిషనర్ దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఆరోగ్యం ఉండాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ రామ్ అన్నారు. సోమవారం ఉదయం స్థానిక వై జంక్షన్ వద్ద “ఆడుదాం ఆంధ్రా” కార్యక్రమాన్ని ఎంపీ భారత్ రామ్, ఇంచార్జి జాయింట్ కలెక్టర్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ప్రారంభించారు.ఎంతో అట్టహాసంగా వై జంక్షన్ నుంచి లాలా చెరువు వరకూ 5 కే రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్ పి మార్గని భరత్ రామ్ మాట్లాడుతూ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సచివాలయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం నిర్వహించు కుంటుంన్నా మన్నారు . అయితే ప్రజలంతా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా కొనసాగించాలన్నది సీఎం జగనన్న ఆలోచన అన్నారు. సీఎం ఎలా ఫిట్ గా ఉన్నారో, ఈ రాష్ట్ర ప్రజలంతా అంతే ఫిట్ గా ఉండాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగనన్న ఈ చైతన్య కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. చిన్న పిల్లల నుండి పెద్దల దాకా ప్రతీ ఒక్కరూ ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో మమేకమై తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిందిగా ఎంపీ భరత్ విజ్ఞప్తి చేశారు. ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయవచ్చు, దేనినైనా సాధించవచ్చు అన్నారు. దేశంలోనే అతి పెద్ద క్రీడా కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగనన్న తలపెట్టిన’ఆడుదాం ఆంధ్రా’ అన్నారు. మనం ఫిట్ గా ఉంటేనే రాష్ట్రం ఫిట్ గా ఉంటుందని, అప్పుడే అభివృద్ధి దిశగా ఏపీ శరవేగంగా పరుగులు పెడుతుందని తెలిపారు. అనంతరం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో నెట్ బాల్, పలు వ్యాయామాలతో ఎంపీ భరత్, రుడా ఛైర్మన్ రౌతు సూర్య ప్రకాశరావు, డాక్టర్ గూడూరి శ్రీనివాస్, స్థానిక నాయకులు సందడి చేశారు. యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఇంఛార్జి జాయింట్ కలెక్టర్ , ఆర్ ఎంసి కోఎస్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ డిసెంబర్ 26 నుండి నిర్వహించే ఈ టోర్నమెంట్ క్రీడోత్సవాలు గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడోత్సవాల్లో ముఖ్యంగా 5 అంశాల్లో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే క్రీడా కారుల నమోదు, టీమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి క్రీడలో పురుషులు, మహిళల జట్లు పాల్గొంటా యన్నారు. క్రికెట్, వాలిబాల్, బ్యాడ్మింటన్, కబాడ్డీ, ఖో-ఖో టీములతో పాటుగా పోటీలేని క్రీడలలో భాగంగా యోగ, టెన్నికోయిట్, మారధాన్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పురుషుల, మహిళల బృందాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న దృష్ట్యా, జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత ఆధ్వర్యంలో క్రీడా పోటీలను విజయవంతం చేయాడానికి ప్రణాళిక సిద్ధం చేశామని, అదే విధంగా ప్రజలు భాగస్వామ్యం కావాలని కోరారు. ప్రజా ప్రతినిధులను, అధికారులను ఈ పోటీల్లో భాగస్వామ్యం చెయ్యడం తోపాటు ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనాల్సి ఉంటుందని అన్నారు. జిల్లాలో 19 మండలాలు 512 సచివాలయాల పరిధిలో 1,74,953 మంది క్రీడాకారులు ఇప్పటి వరకు తమ పేర్లును నమోదు చేసుకున్నారన్నారు. ఇందులో పురుషలు 1,07,184 మంది కాగా మహిళలు 67,769 మంది ఉన్నారన్నారు. క్రీడలు వారీగా క్రికెట్ క్రీడకు సంబందించి 66009 మంది, బాడ్మెంటెన్ కు 19239 మంది, వాలీబాల్ గేమ్ కు 35422 మంది, కబాడ్డీ కి 35939 మంది, ఖోఖో క్రీడకు సంబందించి 36063 మంది నమోదు అయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో క్రికెట్ ఆటకు 196 గ్రౌండ్స్, బాడ్మెంటెన్ కు 307, వాలీబాల్ గేమ్ కు 335, కబాడ్డీ కి 330, ఖోఖో క్రీడకు 322 గ్రౌండ్స్ క్రీడలను నిర్వహించేందుకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమాలలో రుడా ఛైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి కోఆర్డినేటర్ డా.గూడూరి శ్రీనివాస్, స్థానిక నేతలు అడపా శ్రీహరి, మార్తి లక్ష్మి, నక్కా శ్రీనగేష్, ఎన్వీ శ్రీనివాస్, వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు అరీఫ్, తాతబ్బాయి, నగర పాలక సంస్థ , అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News