-ఉదయం 10.30 నుంచి ప్రారంభం
-పాల్గొననున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు
-జిల్లాలోని 512 గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పోటీలు
-కలెక్టర్ డా కె. మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా నుంచి ప్రారంభించ నుండగా, జిల్లా స్థాయి క్రీడా వేడుకలు రాజమహేంద్రవరం లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఉ.10.30 కి ప్రారంభించ నున్నట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన “ఆడుదాం ఆంధ్రా” క్రీడా వేడుకలను పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి గుంటూరు జిల్లా నుంచి పోటీలను ఉదయం 10.30 గంటలకి ప్రారంభినున్నట్లు తెలిపారు. అనంతరం జిల్లా స్థాయి వేడుకలను, నియోజక వర్గ, మండల, సచివాలయ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ఆయా నియోజక వర్గాల ప్రజా ప్రతినిధులు, శాసనసభ్యులు, శాసన మండలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన ప్రజా ప్రతినిధుల ఆయా సచివాలయాల్లో జరిగే క్రీడా పోటీలను ప్రారంభించడం జరుగుతుందని మాధవీలత తెలిపారు. ఈ పోటీల్లో పురుషులతో పాటు మహిళా క్రీడా కారులు పెద్ద ఎత్తున పాల్గొనేలా క్షేత్ర స్థాయిలో ప్రోత్సాహం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా స్థాయి కార్యక్రమంలో కలెక్టర్ కె. మాధవీలత, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ, తానేటి వనిత , ఎంపి మార్గాని భరత్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, స్థానిక ప్రజా ప్రతినిధులు, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు తదితరులు పాల్గొననున్నట్లు జిల్లా క్రీడా ప్రధాన శిక్షకులు బి ఎమ్ ఎమ్ శేషగిరి తెలిపారు.
Prajavartha Online Telugu News