– పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
– డి ఆర్ వో జి. నరసింహులు
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఎపిపి ఎస్సీ ద్వారా శాఖ పరమైన పరీక్షలను డిసెంబర్ 29 , 30 తేదీల్లో నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం ఎపిపిఎస్సీ ద్వారా శాఖా పరమైన పరీక్షలను, విద్యా శాఖ ద్వారా పశు సంవర్ధక శాఖ పోస్టుల భర్తీ నిర్వహణపై జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ లో సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఆర్వో జి. నరసింహులు మాట్లాడుతూ, ఆబ్జెక్టివ్ మరియు కన్వెన్షనల్ విధానంలో డిసెంబర్ 29 , 30 తేదీల్లో ఎపిపి ఎస్సీ ద్వారా శాఖా పరమైన పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. అదే విధంగా రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్సిటిట్యూట్స్ నందు నిర్వహిస్తున్న శాఖాపరమైన పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హల్ టికెట్ తో పాటు, ప్రభుత్వం గుర్తించి అసలు ఫోటో గుర్తింపు కార్డు తో పరీక్ష ప్రారంభించడానికి అరగంట ముందే పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించవలసి ఉంటుందని, ఒక్క నిమిషం ఆలస్యం అయినా అనుమతించడం జరగదని తెలిపారు. ఆబ్జెక్టివ్ టైప్ పరీక్షలు ఉదయం పరీక్ష ఉ.10.00 నుంచి ఉ .12.00 వరకు, మధ్యాహ్నం 3.00 నుంచి 5.00 గంటల వరకు నిర్వహిస్తామని అభ్యర్థులను ఉదయం 9 గంటల నుంచి అనుమతించడం జరుగుతుందని, మధ్యాహ్నం 3.00 నుంచి సా.5 వరకు నిర్వహిస్తామని అభ్యర్థులను మ. 2.00 నుంచి అనుమతించడం జరుగుతుందని స్పష్టం చేశారు. కాలేజీ ప్రధాన మార్గం ద్వారా పరీక్షా కేంద్రం లోకి అభ్యర్థులను అనుమతించడం జరుగుతుందని జిల్లా రెవిన్యూ అధికారి పేర్కొన్నారు. పరీక్ష కేంద్రంలోకి సెల్ ఫోన్లు, ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు అనుమతించమని , తనిఖీ చేసే సిబ్బందికి సహకరించాలన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, తగిన పోలీసులు సిబ్బందిని నియమించాలని, నగర పాలక సంస్థ సానిటేషన్, త్రాగునీరు ఏర్పాటు చేయాలని, మెడికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు, అత్యవసర మందులు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు సిద్దం చెయ్యలని పేర్కొన్నారు. డిసెంబర్ 29 వ తేదీ పరీక్షకు ఉదయం 258 మంది, మధ్యాహ్నం 211 మంది , డిసెంబర్ 30 వ తేదీ పరీక్షకు ఉదయం 440 మంది, మధ్యాహ్నం 116 మంది హాజవుతారని ఎపిపిఎస్సీ అధికారులు తెలిపారు. ఇప్పటికే వారం రోజులు ముందే హల్ టికెట్స్ అభ్యర్థులకు విడుదల చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్ పి. గిరిజరాణి, ఏఎస్ఓ కేఎస్ఎస్ అనిల్ కుమార్, డిఎస్పి డి. రామవర్మ, ఎంపిహెచ్ఓ పి.జాన్సన్ రాజు, విద్యుత్ శాఖ డిఈఈ ఎస్. దేవయ్య, సిఎస్ ఎస్వి. గణేష్ , సిఎస్డిటి నాగలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News