Breaking News

రూ.25 లక్షల వరకు ఆరోగ్య వైద్య చికిత్సకు భరోసా

-పేద, మధ్య తరగతి వర్గాలకి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా భద్రత
-లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ కార్డు అందచేత
-కలెక్టర్ కె. మాధవీలత

రాజమహేంద్రవరం,నేటి పత్రిక ప్రజావార్త :
అందరికీ మెరుగైన వైద్య సేవలు, ఆరోగ్య భద్రత పెంచే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.25 లక్షల వరకు పరిమితిని పెంచడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు. గురువారం ఉదయం రాజేంద్రనగర్ 3, 4 సచివాలయం పరిధిలో ఆరోగ్యశ్రీ పథకం కార్డులను లబ్ధిదారులకు కలెక్టర్ అందచేశారు. ఈ సందర్భం గా కలెక్టర్ కె.మాధవీలత మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఆరోగ్యశ్రీ పథకం పై ప్రజలకు ఎటువంటి సందేహాలు రాకుండా అవగాహన కల్పించే ఉద్దేశంతో ఇంటింటి ప్రచారం చెయ్యడం జరుగుతోందని అన్నారు.  ఇప్పటి వరకు కేవలం పేద వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్యశ్రీ పథకం వార్షిక ఆదాయం నేడు రూ.5 లక్షల వార్షిక ఆదాయం పొందుతున్న మధ్యతరహా కుటుంబాలకు వర్తింప చెయ్యడం జరుగుతోందని అన్నారు. ప్రస్తుతం ఆరోగ్య సేవల వార్షిక ఆర్థిక పరిమితిని రూ.25 లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరికీ ఈ కార్డ్ అందజేయడం జరగాలని, ఇందుకు వాలంటీర్లు ఇంటింటి సర్వే చేస్తూ వివరాలు నమోదు చేయాలన్నారు. ప్రతి ఒక్కరూ వారి మొబైల్ లో ఆరోగ్య శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం తప్పనిసరి , వాలంటీర్లు వ్యక్తిగత బాధ్యత తీసుకుని ఆమేరకు లక్ష్యాలను పూర్తి చెయ్యాలని కె. మాధవీలత పేర్కొన్నారు. సంబంధిత యాప్ లో ఒక కుటుంబ సభ్యులు డేటా ఎంట్రీ చెయ్యడం వల్ల భవిష్యత్తు లో వైద్య సేవలు అందించే సమగ్ర వైద్య, ఆరోగ్య సమాచారం అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట జిల్లా ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్ డా పి. ప్రియాంక, ఆర్ ఎమ్ సి హెల్త్ అధికారి డా వి. వినూత్న, ఇతర సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *