-జనవరి 19 న ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ
– ఫిబ్రవరి 16 న వాలంటీర్స్ కు సేవా పురస్కారాలు
– జిల్లా ఇంఛార్జి మంత్రి సిహెచ్.శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామ స్వరాజ్య స్థాపనే లక్ష్యంగా , మహిళల ఆర్థిక సామాజిక స్వావలంబన దిశగా 2024 జనవరి నెలలో వైయస్ఆర్ పెన్షన్ కానుక, వైయస్సార్ చేయూత , వైయస్ఆర్ ఆసరా, బడుగు బలహీన వర్గాల మార్గ నిర్ధేశకుడు డా బి ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ వంటి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు అందించడం జరుగుతోందని జిల్లా ఇంఛార్జి మంత్రి, సమాచార పౌర సంబంధాలు, సినిమా ఆటోగ్రాఫ్ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం ఉదయం జిల్లా కలెక్టర్లతో సీఎం క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయస్.జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అంబేద్కర్ విగ్రహం ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలపై కలెక్టర్లకు, ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక కలెక్టరేట్ నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, రాజానగరం, గోపాలపురం, నిడదవోలు శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాసనాయుడు, కో ఆర్డినేటర్లు గూడూరి శ్రీనివాస్, చందన నాగేశ్వర్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అవ్వా తాతలకు, వితంతువులకు, దివ్యాంగులకు తదితర వృత్తులు చేసుకునే వారికి, ఆరోగ్య భద్రత కల్పిస్తూ ఆసరాగా పెన్షన్ పెంపుదల జనవరి ఒకటి నుంచి రూ 2750 నుంచి రూ.3 వేలకు పెంపుదల చేస్తూ, ఇచ్చిన హామీ నెరవేర్చడం జరుగుతోందని అన్నారు. స్వయం సహాయక పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైయస్ఆర్ ఆసరా, సున్న వడ్డీ కింద జనవరి 23 నుంచి లబ్దిదారులు ఆర్థిక ప్రయోజనం ను అందించనున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా వైయస్ఆర్ చేయూత పథకాన్ని ఫిబ్రవరి 5 నుంచి నిర్వహిస్తున్నా మన్నారు. ఆయా పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో కార్యాచరణ ప్రణాళిక పై ముఖ్యమంత్రి దిశా నిర్దేశనం చేశారని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలను అందజేస్తుందన్నారు. సామాజిక న్యాయం కు ప్రతిరూపమైన భారత రత్న డా.బి.ఆర్ అంబేద్కర్ ను స్ఫూర్తి గా రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, వారి ఆశయాలను భవిష్యత్ తరాలకు అందించే ప్రయత్నం లో విజయవాడ నగరంలో 19 ఎకరాల్లో రూ.404 కోట్ల వ్యయంతో 125 అడుగుల విగ్రహాన్ని జనవరి 19 వ తేదీన ఆవిష్కరించడం జరుగుతోందని మంత్రి వేణు గోపాల్ పేర్కొన్నారు. విశ్వసనీయత కు మారు పేరు వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన అని, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన మాటకు కట్టుబడి అన్ని సంక్షేమ పథకాలను అర్హులైన లబ్దిదారులకు ఆర్థిక చేయూత అందించిన ఘనత సాధించారన్నారు. వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ ఆసరా, వైయస్సార్ చేయూత, అంబేద్కర్ విగ్రహం వంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేసినట్లు ఇన్చార్జి మంత్రి శ్రీనివాస్ వేణుగోపాల్ కృష్ణ తెలిపారు. ముందస్తు గా ప్రజల్లోకి విస్తృత ప్రచారం, లబ్ధిదారులకు ప్రయోజనం అందించే క్రమంలో పథకం ప్రయోజనం తో పాటు ముఖ్యమంత్రి లేఖ, వీడియో సందేశం , తదుపరి లబ్దిదారుల అభిప్రాయం తెలుసుకునే కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి వెళుతున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 16 న వాలంటీర్ లకు సన్మాన కార్యక్రమం నిర్వహించి, సేవా మిత్రా, సేవా రత్న, సేవా వజ్రా పురస్కారాలతో వారి సేవలకు గుర్తింపు ఇవ్వడం జరుగుతుంది అని పేర్కొన్నారు. కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనం జనవరి, ఫిబ్రవరి నెలల్లో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఆయా కార్యక్రమాలు నిర్వహణ మండల స్థాయి లో నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, జి.శ్రీనివాసనాయుడు, కో ఆర్డినేటర్లు గూడూరి శ్రీనివాస్, చందన నాగేశ్వర్, పిడి డి ఆర్ డి ఎ – ఎన్ వివి ఎస్ మూర్తి, డీఎల్ డి ఓ పి. వీణా దేవి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News