Breaking News

వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా పభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలి

-మహిళల, లబ్దిదారుల , విద్యార్థుల భాగస్వామ్యం ద్వారా పథకాలపై అవగాహన ముఖ్యం
-అర్హత కలిగి ఉండి ఇంకా పథకాల పొందని వారిని గుర్తించడం ముఖ్య ఉద్దేశ్యం
-పాఠశాలలో కూడా ప్రభుత్వ పథకాల పై అవగాహన కల్పించాలి
-ఆకట్టుకున్న ప్రకృతి వ్యవసాయ స్టాల్
– కేంద్ర ఉన్నత విద్య డిప్యూటీ సెక్రటరీ  ప్రియాంక్ చతుర్వేది

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నవంబర్ 25 నుంచి జనవరి 26 వరకు రూట్ మ్యాప్ మేరకు జిల్లాలోని 512 గ్రామ సచివాలయాల పరిధిలో ప్రచార రథం ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ, లబ్దిదారులకు పథకాలు అందచేస్తునట్లు వికసిత భారత్ నోడల్ అధికారి, కేంద్ర ఉన్నత విద్య డిప్యూటీ సెక్రటరీ  ప్రియాంక్ చతుర్వేది తెలిపారు. గురువారం స్థానిక ఐ. పంగిండి గ్రామంలో వికిసిత్  భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో డిప్యూటీ సెక్రటరీ  ప్రియాంక్ చతుర్వేది ఆధ్వర్యంలో సంబంధిత జిల్లా అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రియాంక్ చతుర్వేది మాట్లాడుతూ, వికసిత్ భారత్ సంకల్ప యాత్ర సందర్భంగా కేంద్రం ఎన్నో పథకాలు అమలు చేయడం జరుగుతోం దన్నారు. అందులో ఎంతమంది ప్రయోజనం కలిగింది, ఇంకా ఎంత మంది అర్హులు కలిగి ఉన్నారో తెలుసుకోవడం జిల్లా, మండల, గ్రామ స్థాయిలో ఏర్పాటు చేసిన ఆహ్వాన, ఉత్సవ్, సాంస్కృతిక కమిటీ ల ముఖ్య ఉద్దేశ్యం అని కేంద్ర ప్రభుత్వ నోడల్ అధికారి / కేంద్ర ఉన్నత విద్య డిప్యూటీ సెక్రటరీ  ప్రియాంక్ చతుర్వేది పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఉన్నత విద్య డిప్యూటీ సెక్రటరీ  ప్రియాంక్ చతుర్వేది మాట్లాడుతూ  జిల్లాలోని మారుమూల ప్రాంతాల చిట్ట చివరి లబ్ధిదారుని వరకు కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి చేకూరేల ప్రతి ఒక్క అధికారి, ఉద్యోగి కృషి చేయాలని కోరారు. తొలుత జిల్లాలోని వివిధ శాఖలలో అమలవుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాల శాఖల వారీగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారుల వివరాలు, ఇంకా మిగిలి ఉన్న లబ్ధిదారులు, వారి వద్ద నుండి అందిన అర్జీల సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సంచార ప్రచార వాహనం ద్వారా సచివాలయ పరిధిలో పర్యటించి కేంద్ర పథకాలపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ యాత్ర కార్యక్రమంలో లబ్దిదారులకు , మహిళలు, విద్యార్థులు భాగస్వామ్యం చాలా కీలకమన్నారు.  కేంద్ర ప్రభుత్వ పథకాలపై పట్టణ, గ్రామాలలో విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.  ప్రజలను సమీకరించడం, చైతన్య పరిచేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జనదన్ , పారిశ్రామిక, ఉజ్వల్, హౌసింగ్ కార్యక్రమాల లబ్ధిదారులతో కేంద్ర పథకాల పై ఆరా తీశారు. పారిశుద్ధ్య సౌకర్యాలు, అవసరమైన ఆర్థిక సేవలు, ఎల్‌పిజి కనెక్షన్‌లకు ప్రాప్యత, పేదలకు గృహాలు, ఆహార భద్రత, సరైన పోషకాహారం, ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన విద్య మొదలైన ప్రాథమిక సౌకర్యాలు, తదితరాలను అందించడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన  చివరి లబ్ధిదారుని వరకు  ప్రభుత్వ పథకాల లబ్ధి అందేలా సంబంధిత కృషి చేయాలని, ఆమేరకు  ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన కల్పించడం కోసం ” వికసిత్ సంకల్ప యాత్ర ” ప్రధాన ఉద్దేశ్యం అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థ ద్వారా మానవ వనరులు సంవృద్దిగా ఉన్నాయని, ఆ మేరకు సచివాలయ , వాలంటీర్ ద్వారా ప్రతి ఒక్క గృహాన్ని సందర్శించి ఆమేరకు ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం, ప్రజలను భాగస్వామ్యం చెయ్యడం జరుగుతుందని అధికారులు వివరించారు. ఈ పర్యటన లో ప్రకృతి వ్యవసాయం ద్వారా కూరలు, ఆకుకూరలు పండ్లు తో ఏర్పాటు చేసిన స్టాల్ ను సందర్శించి రైతులతో ముఖాముఖి మాట్లాడారు.. కూరగాయలతో రూపొందించిన ముగ్గు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పోషకాహార స్టాల్ ను సందర్శించి అభినందించారు . ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు, డ్వామా పీడీ పీ. జగదాంబ, డిఆర్డీఏ పిడి ఎన్ వివిఎస్ మూర్తి, డి ఎల్ డి ఓ వి. శాంత మణి, ఇతర జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *