రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇందుమూలముగా యావన్మందికి తెలియజేయునది ఏమనగా ఈ కారాగారమునకు సంబంధించిన పాక్షిక ఆరు బయలు కారాగారము నందుగల పాడి పరిశ్రమ లో గల పశువులు -16 నెం.లు జైళ్ళ ఉపశాఖాధికారి, కోస్తాంద్ర ప్రాంతము, రాజమహేంద్రవరం వారి సమక్షంలో తేది: 30-12-2023 న ఉదయం 11:00 గంటలకు కేంద్రకారాగారము, రాజమహేంద్రవరం నందు బహిరంగ వేలము వేయుటకు నిర్ణయించడమైనదని కేంద్ర కారాగారము పర్యవేక్షణ అధికారి తరపున జైలర్ కే.సురేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. షెడ్యూల్-1 పశువులు -16 నెం .లు షెడ్యూల్-1 వేలములో పాల్గొనవలసిన వారు ధరావత్తు సొమ్ము రూ.8,000.00 చెల్లించి వేలములో పాల్గొనగలరు. ధరావత్తు సొమ్మును తేది: 30-12-2023 న ఉదయం 08:30 గంటల నుండి 10:00 వరకు మాత్రమే కట్టించుకోనబడును. తదుపరి వచ్చిన వారి నుండి ధరాపత్తు సొమ్మును కట్టించుకోవడం జరగదు. సదరు వేలముపాటలో నెగ్గని పాటదారునకు ధరావత్తు సొమ్మును వెంటనే తిరిగి ఇవ్వబడును. పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారము పాటలో నెగ్గిన పాటదారుడు మొత్తం సొమ్మును 18% జీ.ఎస్.టి. తో సహా ఒకే దఫా గా చెల్లించి. సదరు పశువులు తీసుకుని వెళ్ళవలెను. అట్లు చేయని యెడల ధరావత్తు సొమ్మును ప్రభుత్వ ఖజానకు జమ చేయబడును. మరియు శ్రీయుత జైళ్ళ ఉపశాఖాధికారి, కోస్తాంద్ర ప్రాంతము, రాజమహేంద్రవరం వారికి వేలము పాటను అంగీకరించుటకు గాని నిరాకరించుటకు గాని అధికారము కలదు. ఈ వేలము విషయమై ఇతర సమాచారములు తెలుసుకొనవలలెనన్న ఈ కార్యాలయపు పని దినములలో ఉదయం 10-00 గంటల నుండి మధ్యాహ్నం 01-00 గంటల వరకు & మధ్యాహ్నం 02-00 గంటల నుండి 05-00 గంటల వరకు ఈ దిగువ తెలిపిన ఫోన్ నెంబర్లు కు ఫోన్ చేసి తెలుసుకోనవచ్చును. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: జైలర్ (S.O.P)-8555046707.
Tags Rājamahēndravaraṁ
Check Also
చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …
Prajavartha Online Telugu News