Breaking News

తల్లుల బ్యాంకు ఖాతాలకు రు. 19 కోట్ల 55 లక్షల రూపాయలు…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో విద్యా దీవెన క్రింద మొత్తం 26,682 విద్యార్థులకు 24,462 మంది  తల్లుల బ్యాంకు ఖాతాలకు రు. 19 కోట్ల 55 లక్షల రూపాయలను శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ విద్యార్థులు తల్లుల ఖాతాలకు జమ చేయనున్నట్లు జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎమ్. సందీప్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 4 వ విడత “జగనన్న విద్యా దీవెన” పథకం క్రింద వివిధ కేటగిరీలలోని విద్యార్థులకు సంబందించిన తల్లుల ఖాతాలకు జమ చేయడం జరుగు తుందన్నారు. శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి రాష్ట్ర స్థాయి విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొంటారని, జిల్లా స్థాయి కార్యక్రమం స్థానిక కలెక్టరేట్ నుంచి నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ డా కె.మాధవీలత, స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు, లబ్దిదారులు పాల్గొంటారని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *