గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలోని ఎన్టీఆర్ స్టేడియంలో గురువారం జరుగుతున్న ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి, మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి, ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ లతో కలిసి బెలూన్లు వదిలి ప్రారంభించి, క్రీడాకారులను పరిచయం చేసుకొని, షటిల్ ఆడారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ గతంలో క్రీడా సౌకర్యాలు లేకపోవడం వలన ప్రతిభ ఉన్న అనేక మంది క్రీడాకారులు తమ ప్రతిభను చాటలేకపోయారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి, వారికి తగిన ప్రోత్సహం అందించెందుకే ఆడుదాం ఆంధ్రా ని ప్రారంభించారని తెలిపారు. గ్రామ స్థాయి నుండి ప్రతిభ చూపిన క్రీడాకారులకు భవిష్యత్ లో క్రీడల్లో ఉత్తమ అవకాశాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మంత్రి విడదల రజిని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర ద్వారా క్షేత్ర స్థాయిలోని యువత క్రీడా నైపుణ్యాలు వెలుగులోకి వస్తున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి విద్య, వైద్యాలకు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అధిక ప్రాధాన్యత ఇచ్చారని, అలాగే క్రీడల్లో ఆడుదాం ఆంద్ర ద్వారా దేశానికే ఆదర్శంగా ప్రతిభకు ఫ్లాట్ ఫారం వేస్తున్నారన్నారు. యువత ఆడుదాం ఆంధ్ర ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా రానున్న కాలంలో క్రీడల ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని తెలిపారు.
ప్రభుత్వ విప్ లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రా ద్వారా ముఖ్యమంత్రి టాలెంట్ హంట్ చేస్తున్నారని, ప్రతిభ ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇస్తుందన్నారు. పోటీలకు అవసరమైన క్రీడా పరికరాల కిట్స్ కూడా అందించడం ద్వారా గ్రామీణ స్థాయిలో కూడా ఎక్కువమంది పోటీల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించారని పేర్కొన్నారు. మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు మాట్లాడుతూ యువత చదువుతో పాటు ఆటలు ఆడితేనే శారీరక దృఢత్వం లభిస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విద్యా వ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక చర్యల వలన దేశంలో ఎక్కడాలేని విధంగా ప్రతి ఒక్కరికీ ఉన్నత సౌకర్యాలతో విద్య, వైద్యం అందుతున్నాయన్నారు. ఆడుదాం ఆంధ్ర ద్వారా వార్డ్ సచివాలయం స్థాయి నుండి క్రీడల పట్ల ఆసక్తి, ప్రతిభ ఉన్న వారిని గుర్తించడం, వారికి అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు. ఎంఎల్ఏ మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా విదానంలో పిల్లలు సెల్ ఫోన్ లోనే ఆటలు ఆడుతూ ఆరోగ్యాన్ని నష్టం చేసుకుంటున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలకు చదువుతో పాటుగా వారికి నచ్చిన ఆటల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆడుదాం ఆంద్ర ద్వారా ఆటల పండుగను తెచ్చారని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కమిషనర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్రలో భాగంగా నగరంలో వార్డ్ సచివాలయాల వారిగా వాలీబాల్, కబాడీ, ఖోఖో, క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్ విభాగాల్లో రిజిస్టర్ చేసుకున్న క్రీడాకారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొంటున్నారని పేర్కొన్నారు. ఎవరైనా మైదానాల వద్ద అప్పటికప్పుడు తాము కూడా ఆడతాము అంటే వారిని స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. ఆటల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడాస్పూర్తితో ఉండాలని కోరారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ టి.వెంకట కృష్ణయ్య, ఎస్.ఈ.(ఎఫ్ఏసి) సుందర్రామి రెడ్డి, డిఈఈ రఫిక్, ఎస్.ఎస్. సోమ శేఖర్, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News