-దేశ రక్షణకు సైనికులు సేవలు ఎంత ముఖ్యమో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అంతే ముఖ్యం
-జగనన్న ప్రభుత్వం ఆశ్రిత పక్షపాతం,అవినీతికి తావు లేకుండా ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకముగా అందిస్తున్నాం
-ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తా..
-ఒక సేవకునిగా మొదటి శ్రేణిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల పాద పూజ దైవముగా భావిస్తున్నా..
-పారిశుద్ధ్య కార్మికులకు పూలతో పాద పూజ చేసి దృశ్యాలువాతో ఘనంగా సత్కారం
-మంత్రి వేణుగోపాలకృష్ణ
రాజమండ్రి , నేటి పత్రిక ప్రజావార్త :
నగరాల్లో, గ్రామాల్లో ఉన్న చెత్తను తొలగించి శుభ్రపరిచి ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే పారిశుద్ధ్య కార్మికులు ప్రథమ వైద్యులని , వారిని గౌరవించుకోవడం మన బాధ్యత అని జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ సంక్షేమం సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ అన్నారు. ఆదివారం ఉదయం”స్వచ్ఛ భోగి” కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజక వర్గంలో వేడుకగా ధవళేశ్వరం జక్కంపూడి కళ్యాణ మండపం ఆవరణలో
నిర్వహించిన స్వచ్ఛత- బాధ్యత కార్యక్రమంలో మంత్రి వేణు గోపాలకృష్ణ స్థానిక నాయకులు అధికారులతో కలిసి
పారిశుద్ధ్య కార్మికుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణు గోపాలకృష్ణ స్థానిక నాయకులు, అధికారులు పారిశుద్ధ్య కార్మికులు తో కలిసి భోగి మంటలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం రూరల్ నియోజకవర్గం రాజమండ్రి రూరల్ మండలం, కడియం మండలంలో గల గ్రామాల్లోని, నగరపాలక సంస్థ పరిధిలో గల వార్డుల్లోని పారిశుద్ధ్య కార్మికులకు పూలతో పాద పూజ చేసి దృశ్యాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ దేశ ప్రజలు స్వేచ్ఛ గా జీవించేందుకు దేశ పరిరక్షణకు సైనికులు ఎంత ముఖ్యమో.. గ్రామాల్లో ఉన్న దుర్గందాలను తొలగించి శుభ్రపరిచి సమాజ శ్రేయస్సు, ప్రజారోగ్యాన్ని కాపాడే వీర సైనికులే పారిశుద్ధ్య కార్మికులని వారిని గౌరవించి సన్మానించుకోవడం మన సామాజిక బాధ్యతని అన్నారు. గ్రామాలను, పట్టణాలును ఆరోగ్యకరంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులే ప్రధమ వైద్యులని మంత్రి పేర్కొన్నారు. పండుగ రోజున అతి సామాన్యుడు కూడా సంతోషంగా చేసుకుంటారన్నారు. ప్రజల కోసం నిరంతరం సేవ చేసే పారిశుధ్య కార్మికులకు వారికి అండగా నేనున్నానంటూ వారిని గౌరవించుకుంటూ ఈరోజు “స్వచ్ఛ భోగి” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. నిరంతరం గ్రామాలను పరిశుభ్రతగా ఉంచేందుకు పనిచేసే ప్రధమ వైద్యుడా.. ప్రధమ సైనికుడా.. పారిశుద్ధ్య కార్మికుడా.. నేను మీ సేవకున్ని మీ సమస్యలను నా సమస్యలుగా భావించి రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దళారీ వ్యవస్థను రూపుమాపి, ఆశ్రిత పక్షపాతం,అవినీతికి తావు లేకుండా లేకుండా ప్రజా సంక్షేమ పథకాలను పారదర్శకముగా అర్హులైన ప్రతి ఒక్కరికి వాటి ప్రయోజనాలను అందిస్తూ దేశానికే ఆదర్శమయ్యారన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలకుడిగా కాకుండా ఒక సేవకునిగా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాని ఇంటి వద్దకే అందిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని ఆదర్శం గా తీసుకుని నేను ఒక సేవకునిగా మొదటి శ్రేణిలో ఉన్న పారిశుద్ధ్య కార్మికుల పాద పూజ దైవముగా భావించి చేస్తున్నానని మంత్రి అన్నారు. నిజమైన సమాజ సేవకులు పారిశుధ్య కార్మికులని, ప్రజారోగ్యమే లక్ష్యంగా వారి ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా దుర్గంతపూరితమైన మలినాలను తొలగిస్తూ చేస్తున్న వారి సేవలు అమరామరం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షపాతిగా, పారిశుధ్య కార్మికులకు మేలు చేసే విధంగా వారి సంక్షేమం కొరకు సిఎం జగన్ మోహన్ రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫుల్ చైర్మన్ నాగేశ్వర్, జిల్లా పంచాయతీ అధికారి జే సత్యనారాయణ, కడియం ఎంపీడీవో కే రత్నకుమారి, రాజమండ్రి రూరల్ తాసిల్దార్ పి.చిన్నారావు, స్థానిక నాయకులు గిరిజాల బాబు, అధికారులు, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News