Breaking News

తెనాలి నియోజకవర్గంలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు

-జనసేన నాయకులు, వీర మహిళలు గ్రామల్లో నిర్వహించిన మన ఊరు
–మన ఆట కార్యక్రమాల్లో పాల్గొన్న పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతి సంబరాల్లో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్  ఆదివారం ఉత్సాహంగా పాల్గొన్నారు. మకర సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి రోజున నియోజకవర్గం అంతటా వివిధ గ్రామాల్లో జనసేన పార్టీ నాయకులు, వీర మహిళల ఆధ్వర్యంలో ‘మన ఊరు – మన ఆట’ కార్యక్రమాలు ఉల్లాసంగా మొదలయ్యాయి. మూడు రోజులపాటు సంప్రదాయాల కలబోతగా సాగే వివిధ రకాల ఆటలు ఆడుతూ.. ముచ్చటైన రంగవల్లులను వేసి మహిళలు సందడి చేశారు. హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల ఆటలు, సొంతూళ్లకు వచ్చిన యువకుల కేరింతలు… కొత్త అల్లుళ్ల సందడితో నిండుగా సంక్రాంతి సందడి గ్రామాల్లో కనిపించింది.
తెనాలి నియోజకవర్గం పరిధిలోని నందివెలుగు, అత్తోట, కొలకలూరు, తూములూరు గ్రామాల్లో మనోహర్ ఆదివారం పర్యటించి అక్కడి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన రంగవల్లులు, వంటల పోటీలు, ఇతర సంక్రాంతి సంప్రదాయ ఆటల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందించి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ‘‘సంక్రాంతి పండుగ తెలుగువారి సంప్రదాయాలకు ప్రతీక. ప్రతి ఒక్కరూ సంతోషంగా గడిపే సమయంలో చేసుకునే గొప్ప వేడుక. అందరినీ ఒక దగ్గరకు చేరుస్తుంది. సొంతూళ్లకు వచ్చిన యువతరం రాష్ట్ర భవిష్యత్తు గురించి కూడా ఆలోచన చేయాలి. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే జనసేన – తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అవసరం. సంక్రాంతికి మంచి కార్యక్రమాలు నిర్వహించిన జనసేన నాయకులకు, వీర మహిళలకు ప్రత్యేక అభినందనలు’’ అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *