Breaking News

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆడగలము అనే విధంగా యువతలో క్రీడా స్ఫూర్తిని నింపారు సీఎం జగన్

– అమ్మ ఒడిని ఔషధం ద్వారా  బాల కార్మిక వ్యవస్థను రూపుమాపిన  ఏకైక నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి
-“ఆడుదాం ఆంధ్రా” రాజమండ్రి రూరల్ నియోజకవర్గస్థాయి విజేతలకు ప్రైజెస్ పంపిణీ చేసిన..
-మంత్రి వేణుగోపాలకృష్ణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మన యువ క్రీడాకారులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా ఆడగలమనే క్రీడా స్ఫూర్తిని ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి యువతలో మనోధైర్యాన్ని నింపారని జిల్లా ఇన్చార్జ్ మంత్రి రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార పౌర సంబంధాలు సినిమా ఆటోగ్రఫీ శాఖ మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఆడుదాం ఆంధ్ర క్రీడల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు ప్రైజెస్ పంపిణీ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ అధికారులు స్థానిక నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి పేద విద్యార్థికి ఉన్నత విద్యను అందించడమే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా తపస్వీ గా దేశంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఆలోచన చేసి ఆంధ్రప్రదేశ్ లో మారుమూల ప్రాంతంలోని విద్యార్థులకు కూడా ఐబి ఎడ్యుకేషన్ అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఐబి లో చేరాలంటే సంవత్సరానికి రు.7 లక్షలు నుంచి రు.36 లక్షలు ఖర్చు అవుతుందన్నారు. జపాన్, దక్షిణ కొరియాకే పరిమితమైన ఐబీ ఎడ్యుకేషన్ సీఎం జగన్మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయంతో ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అందుబాటులోనికి తేవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నాణ్యతతో కూడిన విద్యను అందించే విధంగా ఇప్పటికే 14 వేల మంది టీచర్లను రిక్రూట్ చేసుకోవడం జరిగిందని, మరో 6100 మంది టీచర్స్ ను రిక్రూట్ చేస్తున్నామన్నారు. ఎన్ఐటి, ఐఐటీలో చదివిన ఇంజనీర్లకు క్యాంపస్ ఈ విధంగా సీటు వస్తుందో ఐబి లో చదివిన విద్యార్థికి ఇంటర్నేషనల్ స్థాయి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో సీటు వస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రతి పేద విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలనే విధంగా విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ అమ్మ ఒడి అనే ఔషధం ద్వారా బాల కార్మిక వ్యవస్థను రూపుమాపిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గ స్థాయిలో గెలుపొందిన విజయాతులను మంత్రి అభినందించారు. విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు క్యాష్ ప్రైస్, మెమెంటో సర్టిఫికెట్ ను అందించి అభినందించారు. ఇందులో క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, కోకో క్రీడల్లోని విజేతలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ గా రు. 35వేలు, రు.25 వేలు, రు.5 వేలు రూపాయలు, బ్యాడ్మింటన్ లోని విజేతలకు ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ గా  రు. 20వేలు, రు.10 వేలు, రు.5 వేలు క్యాష్ ప్రైస్ గా అందించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్, రూరల్ పరిశీలకులు. పీకే రావు, బొమ్మూరు మాజీ సర్పంచ్ మద్దిపాటి శంబాజీరావు, గిరిజన సంక్షేమ, మండల ప్రత్యేక అధికారి కెఎన్ జ్యోతి, ఎంపీడీవో డి. శ్రీనివాసరావు, ఎంఈఓ తులసీదాస్, స్థానిక నాయకులు బొప్పన సుబ్బారావు, పసలపూడి శ్రీనివాసరావు, వెయ్యల రాజేష్, సచివాల కార్యదర్శులు, వీటిలో క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *