రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
గురువారం తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ . కె. ప్రత్యూష కుమారి స్థానిక దానవాయిపేట మునిసిపల్ హై స్కూల్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రత్యూష కుమారి విద్యార్ధులతో మాట్లాడుతూ , బాలికలు వారి భద్రత విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల పై వివరించారు. అపరిచితులు, మోసపూరిత వ్యక్తులతో పరిచయాలు ప్రమాదాలకు దారి తీస్తాయన్నారు. వారి పట్ల జరిగే అన్యాయాలను ధైర్యంగా ఎదురుకోవాలని, వాటిని సహిస్తూ మౌనంగా ఉంటే పరిస్థితులు మరింత ప్రమాదకరంగా మారిపోతాయని వివరించారు. వారికి మంచి, చెడు స్పర్శల గురించి అవగాహన కల్పించారు. వారి పట్ల ఎవరైనా అసభ్యకరంగా వ్యవహరిస్తే పోలీసు స్టేషన్ నందు ఫిర్యాదు చేయాలని అన్నారు. “పోక్సో చట్టం, 2012”, నల్సా వారి “పిల్లలకు స్నేహపూర్వక న్యాయ సేవలు మరియు వారి సంరక్షణ పథకం, 2015” మొదలగు అంశాలపై అవగాహన కల్పించారు. ఎలాంటి న్యాయ సమస్యలు ఎదురైనా జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. పాఠశాల పరిసరాలను, ప్రభుత్వం అమలు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు.
Prajavartha Online Telugu News