విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్వేంద్రియానం నయనం ప్రదానం… కంటిపరీక్షలు, చికిత్సా విధానంలో జాతీయ స్థాయిలో ఖ్యాతి గడిరచిన ‘మ్యాక్సీవిజన్’ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి గురువారం ప్రకాష్‌నగర్‌లో జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రత్యేక క్యాంప్‌ను నిర్వహించింది. ఈ సందర్భంగా క్యాంప్ కౌన్సిలర్ రాజేశ్వరి మాట్లాడుతూ తమ సంస్థ తరఫున ఇటువంటి క్యాంప్‌లు తాము గతంలో కూడా ఎన్నో నిర్వహించామని, ఈ క్యాంప్‌ల ద్వారా కంటి ఇబ్బందులు వున్న ఎంతో మంది తమ సలహాలు, సూచనలు ఇచ్చి అవసరమైతే చికిత్సల ద్వారా కూడా పూర్తిగా వారి కంటి ఇబ్బందులను పోగొడుతున్నామన్నారు. పేద, మధ్య తరగతి వారికి తమ వంతు సహకారంగా తమ సంస్థ ద్వారా చికిత్సలలో కూడా రాయితీలు కల్పిస్తున్నామన్నారు. ‘మ్యాక్సీవిజన్’లో ఎంప్లాయ్ హెల్త్ కార్డ్‌తో పాటు తదితర కంపెనీల హెల్త్ కార్డులను కూడా ఉపయోగించుకునే సౌకర్యాన్ని కల్పిస్తున్నామన్నారు. తమ సంస్థలో అంతర్జాతీయ టెక్నాలజీ వున్న పరికరాల ద్వారా అత్యాధునిక వైద్య విధానం ద్వారా, నిష్ణాతులైన వైద్యుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు, చికిత్సలు జరుగుతాయన్నారు. ‘మ్యాక్సీవిజన్’లో కాటరాక్ట్, రిఫ్రాక్టివ్, కరోనియా, రెటీనా, గ్లకోమా తదితర సర్వీసులు, పిల్లల ఐ కేర్, ఆప్టికల్ సర్వీసెస్, కాంటాక్ట్ లెన్స్ తదితర సర్వీసులతో కూడిన వైద్య చికిత్సలు అందజేస్తున్నామన్నారు. ‘మ్యాక్సీవిజన్’ అన్ని ముఖ్య పట్టణాలలో అందుబాటులో సేవలు అందిస్తుందన్నారు. కంటి ఇబ్బందులు వున్న వారు కొన్ని అపోహలలో వుంటారు. అలాంటి వారికి ఇక్కడ కౌన్సిలింగ్ ద్వారా వివరించి చికిత్సలో భద్రత, గ్యారంటీ, అతి తక్కువ ఖర్చుతో అందజేస్తున్నామన్నారు. సాధ్యమైనంత వరకు మారుమూల ప్రాంతాల వారికి కూడా వైద్యసేవలు అందించడమే ‘మ్యాక్సీవిజన్’ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్ నిర్వాహకులు మునేశ్వరరావు, అప్టామిట్రిస్ట్ పాషా, వైద్యులు, వైద్యశాఖాధికారులు, వివిధ శాఖల అధికారులు, నాయకులు, కార్యకర్తలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News