Breaking News

ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో మానవ వనరులు పై నీవేదిక

-పోలింగ్ అధికారుల సిబ్బంది డేటా నమోదు ప్రక్రియ పూర్తి
– పోలీసు బలగాలు, ఇతర అనుబంధ భద్రత సిబ్బంది డేటా పై నివేదిక
– కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కే.మాధవీలత
– ఎస్పీ పి. జగదీష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణ ముందస్తు ఏర్పాట్లు, ఎన్నికల సిబ్బంది గుర్తింపు డేటా నమోదు, పోలీసులు, భద్రతా దళాలు మానవ వనరులు గుర్తింపు పై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరుగుతోందని కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, ఎస్పీ పి. జగదీష్ లు వివరించారు. శుక్రవారం సాయంత్రం వెలగపూడి నుంచి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. స్ధానిక కలెక్టరేట్ నుంచి కలక్టర్ / జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత, ఎస్పీ పీ. జగదీష్, డీ ఆర్వో జి. నరసింహులు, ఇతర నియోజక వర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎలెక్టోరల్ అధికారులు, పోలిస్ అధికారులు, కలక్టరేట్ ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు. ఓటరు జాబితా అనంతరం ఫారం 6, 7, 8 లయొక్క ప్రస్తుత పురోగతి తదితర అంశాలపై రాష్ట్ర ప్రథాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారి, మరియు పార్లమెంట్, అసెంబ్లీ నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమిక్ష నిర్వహించారు. ఈ సంధర్భంగా తొలుత జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె. మాధవీలత వివరాలు
తెలియ చేస్తూ, జిల్లాలో తుది ఓటరు జాబితా ప్రకటించిన జనవరి 22 నాటికి ఉన్న పెండింగ్ దరఖాస్తులు, తదుపరి కొత్తగా ఓటర్ల నమోదు, మార్పులు చేర్పులు, తొలగింపుకి చెంది 42,783 దరఖాస్తులు ఉన్నాయనీ పేర్కోన్నారు. వాటిలో ఇంకా పరిష్కారం చేయవలసినవి 16,533 ఉండగా ఫారం 6 లు 3,203 , ఫారం 7 లు 9,692 , ఫారం 8 లు 3,639 ఉన్నాయనీ తెలియ చేశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు దరఖాస్తులను పరిష్కరించడం జరుగుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నియోజక వర్గాల వారీగా తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ లు, కమిషనింగ్ రూమ్స్, పొలింగ్ మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ తదితర అంశాల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో పర్యటించి అధ్యయనం చేయడం జరిగిందనీ తెలిపారు. అందుకు అనుగుణంగా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది అని పేర్కొన్నారు. పోలిస్, రెవెన్యూ ఇతర ఉన్నతాధికారులతో సమన్వయం సాధించడం లో భాగంగా సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికీ తొలిదశ లో భాగంగా బీ ఎల్ వో నుంచి మాస్టర్ ట్రైనర్ ల వరకూ శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లా ఎస్పీ పి. జగదీష్ భద్రత చర్యలు పై నివేదిక అందచేశారు. సమస్యాత్మక అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వివరాలను గత ఎన్నికల నేపథ్యంలో గుర్తించడం జరిగిందన్నారు. ఎఫ్ ఎస్ టి / ఎస్ ఎస్ టి (ఫ్లయింగ్ స్క్వాడ్ మరియు నిఘా బృందాలు) కోసం అవసరమైన భద్రత అధికారులని, పోలీస్ సిబ్బందిని అంచనా వేసి నివేదిక అందచేసా మన్నారు. జిల్లా వ్యాప్తంగా వున్న పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్, పొలింగ్ మెటీరియల్ పంపిణీ వ్యవస్థ, ఇతర అనుబంధ కార్యకలాపాల కోసం అవసరమైన భద్రత సిబ్బంది డేటా సేకరించడం జరిగిందన్నారు. వనరబుల్, క్రిటికల్ పొలింగ్ కేంద్రాల వివరాల ను గత సాధారణ ఎన్నికలు సంఘటనలు ఆధారంగా చేసుకుని గుర్తించడం జరిగిందన్నారు. అంతర్ రాష్ట్ర బోర్డర్, ఇతర రాష్ట్రాల నుంచి జిల్లాకు వొచ్చే బోర్డర్స్ ను గుర్తించి, ఆయా ప్రదేశాల్లో చెక్ పోస్ట్ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చెయ్యనున్నట్లు పేర్కోన్నారు. ఈ సమావేశం లో డి ఆర్వో జి. నరసింహులు, రాజమండ్రి (రూరల్) ఎస్.డి.సి., / ఈ ఆర్ ఓ – ఎస్. సరళా వందనం, ఓఎన్జీసి ఎస్.డి.సి / గోపాలపురం నియోజక వర్గ ఆర్ వో – కె ఎల్ శివజ్యోతి, -స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పి ఐ పి ఆర్ ఎమ్ సి యూనిట్-I, కొవ్వూరు / నిడదవోలు ఆర్ వో – ఆర్ వి రమణా నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *