Breaking News

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల శిక్షణ కార్యక్రమం కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రక్రియ సజావుగా నిర్వహించే నేపథ్యంలో రాజకీయ పార్టీలు, ఎన్నికలలో పోటి చేసే అభ్యర్ధులు ఎంతో క్రియాశీలక మైన పాత్ర పోషించాల్సి ఉంటుందనీ , మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కె. మాధవీ లత విజ్ఞప్తి చేశారు. బుధవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికలు – రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధానంపై శిక్షణ , అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీలత మాట్లాడుతూ , ఎన్నికల నియమావళిని రాజకీయపార్టీలు విధిగా పాటించాలనీ,   ఎన్నికల నియమావళిపై  సందేహాలు నివృత్తి చేసేందుకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుందనీ అన్నారు. ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన వెంటనే రాజకీయ పార్టీలు ఎన్నికల నిబంధనలను పాటించాలనీ, ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడ వద్దన్నారు.   నామినేషన్ల తర్వాత ఈవీఎంలను నియోజకవర్గాలకు తరలిస్తామన్నారు.  రాజకీయ పార్టీల తమ ప్రచార వివరాలను తెలియచేయాలన్నారు. ప్రభుత్వ ఆస్థులపై ఏలాంటి ప్రచార అంశాలు ఉండొద్దని తెలిపారు. ఎన్నికలకు సంబందించి ఏలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఆయా ఎన్నికల అధికారుల అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలు చేసే ఫిర్యాదుల పై వ్రాత పూర్వకంగా వివరాలు అందచెయ్యడం జరుగుతుందన్నారు. పార్లమెంటు ఈ ఆర్ ఓ ఆర్ . కృష్ణ నాయక్ శిక్షణ కార్యక్రమం లో భాగంగా , ఎలక్టోరల్ రోల్,  పోలింగ్ స్టేషన్లలో కనీస మౌలిక సదుపాయాలు, పోలింగ్ పార్టీలు విధులు, బాధ్యత లు , , నామినేషన్ ,  మోడల్ ప్రవర్తనా నియమావళి , పోలింగ్ రోజు చేపట్టే ప్రక్రియ ,  పోస్టల్ బ్యాలెట్,  ఇంటి ఓటింగ్,  వ్యయ పర్యవేక్షణ, పంపిణీ మరియు రిసెప్షన్ కేంద్రాల ఏర్పాట్ల పై అవగాహన కల్పించడం జరిగింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయు అభ్యర్థులందరూ ఎన్నికల నియమావళిని పాటించడంతో పాటు ఎన్నికల వ్యయాన్ని పక్కాగా నిర్వహించాలని అన్నారు. పోటీ చేసే అభ్యర్యులు ఎన్నికల వ్యయం పై నిర్వహించే రికార్డులు, అక్కౌంట్స్, ఎంసీసీ, ఎంసీఎంసి, సువిధ, సి-విజిల్ లాంటి వివిధ ఐటి అప్లికేషన్స్ పై రాజకీయపార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించడం జరిగింది. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మేరకు ఎంపీ కు పోటీ చేయు అభ్యర్థి రూ.95 లక్షలు, ఎమ్మెల్యే కు రూ.40 లక్షల ఖర్చు మించరాదన్నారు. అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే రోజు కంటే ముందుగానే విడిగా ఒక బ్యాంక్ ఖాతాను ఓపెన్ చేయాలన్నారు. నామినేషన్ వేసిన రోజు నుండి డేట్ ఆఫ్ డిక్లరేషన్ వరకు తన ఎన్నికల ఖర్చును సంబంధిత రిజిష్టర్ నందు నమోదు చేసి నిర్ణీత సమయంలో వ్యయ అధికారులకు చూపించాలన్నారు. ఎన్నికల అధికారులు అభ్యర్థుల ఖర్చు పై షాడో రిజిస్టర్లను నిర్వహిస్తుంటారని తెలిపారు. అభ్యర్థి తన నామినేషన్ పత్రాలను జాగ్రత్తగా పూరించాలన్నారు. ప్రచారానికి స్టార్ క్యాంపెనర్లు వచ్చేటట్లు ఉంటే ముందుగానే సీఈఓ నుండి అనుమతి తీసుకోవాలన్నారు. నామినేషన్ దాఖలు చేసిన రోజు నుండి అభ్యర్థి ప్రచారానికి అవసరమైన అనుమతులను సువిధ యాప్ లో అప్లోడ్ చేసి అనుమతులను పొందాలన్నారు. ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులను చేయాలనుకుంటే సి-విజిల్ యాప్ ద్వారా చేయాలన్నారు. అభ్యర్థులు తమ సోషల్ మీడియా ఐడి లను ఇవ్వాలన్నారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసుకునే అభ్యర్థులు సంబంధిత ప్రకటనలపై మూడు రోజుల ముందుగానే ఎంసీఎంసి (మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ) ద్వారా అనుమతి తీసుకోవాలన్నారు. వార్తా పత్రికలలో వచ్చే అభ్యర్థుల ప్రకటనలు, చెల్లింపు వార్తలను ఎన్నికల నియమావళి మేరకు ఎంసీఎంసి పరిశీలించి రేట్ కార్డ్ ఆధారంగా ఖర్చు లెక్కించి అభ్యర్థుల ఎన్నికల ఖర్చు ఖాతాకు జమచేసేందుకు సంబంధిత ఆర్వోలకు పంపిబడుతుందన్నారు. ఇతర నేతలను విమర్శించే ప్రకటనలు, కుల, మత పరంగా దాడులను ప్రోత్సహించే ప్రకటనలు, అసభ్యకరమైన, పరువు నష్టం కలిగించేవిధంగా, హింసను ప్రేరేపించే విధంగా, న్యాయ వ్యవస్థ ధిక్కారం క్రింద వచ్చే విషయాలు, తదితర అంశాల ప్రకటనలను చేయరాదన్నారు. అలాగే దేవాలయాలు, మసీదులు,చర్చీలు, గురుద్వారాలు. ఇతర ప్రార్థనా స్థలాలు, మతపర సూక్తుల గుర్తులు, ఫోటోలు, నినాదాలు, పోస్టర్లు తదితరాలను తమ రాజకీయ ప్రకటనలందు ఉపయోగించ రాదని, అలాగే అక్కడ ఎలాంటి ప్రచారం చేయరాదన్నారు. కుల,మత పరంగా ఓట్లు అడగరాదన్నారు. రానున్న ఎన్నికలను పకడ్బందీగా, నిష్పక్షపాతంగా, నిర్భయంగా, పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించేందుకు మనమందరం కృషి చేద్దాం అన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమం లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, పార్లమెంటు ఈ ఆర్ ఓ ఆర్ . కృష్ణ నాయక్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు  బీఎస్పీ ఉపాధ్యక్షులు బి. సూరిబాబు, బిజెపి – జిల్లా జనరల్ సెక్రెటరీ  బి. రామచంద్ర రావు, టిడిపి స్టేట్ బిసి సెల్ కార్యదర్శి  సిహెచ్ శ్రీనివాస్, వైయస్ ఆర్ సీపీ జేసి ఎస్ ఇంఛార్జి కే ఆర్ జయకర్, టి . వెంకట రావు, కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ డి టి లు  ఎమ్. సునీల్ కుమార్, కె. తులసీ, ఎన్ ఐ సి టెక్నికల్ పర్సన్ సతీష్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *