Breaking News

ఎన్నికల సమాచార ప్రజలకి చేర్చడంలో మీడియా బాధ్యత కీలకం

-ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిన నియమావళిని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను అనుసరించాలి
-ఎన్నికల సందర్భంలో ప్రింట్ , ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా పాత్ర పై శిక్షణ కార్యక్రమం…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అవగాహన కల్పించి సందేహాలు నివృత్తి చేసిన జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ , కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. కే. మాధవీలత రానున్న సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని వాస్తవికత కలిగి ప్రజలకి చేరవేయడం లో ఎన్నికల సిబ్బంది, అధికారులతో సమానంగా మీడియా పై ఎంతో గురుతరమైన బాధ్యత ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహిం చడంలో జిల్లా యంత్రాంగానికి మీడియా తమ వంతు సహకారాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కే మాధవీలత విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిర్వహణ పై గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరం కలెక్టర్ మాధవి లత, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి ఎన్నికలలో మీడియా పాత్ర పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె . మాధవీ లత మాట్లాడుతూ జిల్లాలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ సజావుగా జరగడానికి తీసుకున్న ఏర్పాట్ల పై వివరించారు. ఎన్నికల నిర్వహణా పై ప్రతికూల వార్తలు ప్రచురించే సందర్భంలో సంభందిత పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి దృష్టికి తీసుకుని వెళ్లి, వాస్తవా లను మాత్రమే ప్రచురించాలని కోరారు. అసత్య మైన కథనాలు వల్ల ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. వాటికీ సంబందించి వివరణలను ఖచ్చితంగా ప్రజలకు, ఓటర్ల కు చెరవెయ్యల్సి ఉంటుందనీ పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులకు సంబంధించి పాత్రికేయులు వాస్తవమైన సమాచారం తో కూడిన రిపోర్టింగ్ చేయాలని తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రాంతం, మతం, కులం, జాతి, వర్గం లేదా భాష ఆధారంగా ప్రజల మధ్య విద్వేషాన్ని పెంచే వార్తలను రిపోర్టింగ్ చేయకూడదని స్పష్టం చేసారు. ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ జారీ చేసే సూచనలను ప్రచురించడం ప్రసారం చేయడం ద్వారా ప్రజలకు, పోటీలో ఉండే అభ్యర్ధులకు ఎన్నికల కమిషన్ నియమావళి పై అవగాహన కలిగించాలని అన్నారు. ముఖ్యంగా చెల్లింపు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ అభ్యర్ధి కోసం రాసారో ఆ అభ్యర్ధి వ్యయం లో చెల్లింపు వార్త విలువ జమ అవుతుందని గుర్తుంచు కోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఉల్లంఘనల పై వార్తలు రాసి అభ్యర్ధులకు, ప్రజలకు అవగాహన కలిగించ డానికి మీడియా తమ వంతు కృషి చేయాలనీ అన్నారు. ఎంపీ అభ్యర్థికి రూ..95 లక్షలు, ఎమ్మెల్యే అభ్యర్థికి రు.40 లక్షలు వరకు మాత్రమే ఎన్నికల నియమాల్ని అనుసరిస్తూ ఖర్చు పరిమితం చేయవలసి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సదుపాయం కల్పిస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులను ఆయా పొలిటికల్ పార్టీ సమక్షంలో ఈవీఎంలో పోటీలో ఉండే అభ్యర్ధుల బ్యాలెట్ పేపరు నమోదు జరుగుతుందన్నారు. పోలింగ్ రోజున సాయంత్రం 5 గంటలకు వరకు ఎంత మంది ఓటర్స్ క్యూ లైన్ లో ఉంటారో వారందరినీ తమ ఓటు హక్కును వినియోగించడానికి అవకాశం కల్పిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎన్నికలలో మీడియా పాత్ర పోషించాల్సి అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది.

ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు :
జిల్లాలో అన్ని పోలింగ్ మౌలిక వసతులను ఏర్పాటు చేయడం జరిగిందని, ఎక్కువ మంది ఓటర్లు ఉన్న చోట ఓటర్ల కోసం క్యూ నిర్వహణ, షేడ్స్ ఏర్పాటు, తాగు నీటి వసతులను కల్పించడం జరిగిందని తెలిపారు. వికలాంగులకు, వృద్ధులకు, పోలింగ్ స్టేషన్ కు రాలేని వారి కోసం ప్రత్యెక రవాణా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

పోస్టల్ బాలట్ :
పోస్టల్ బాలట్ ను సర్వీస్ ఓటర్ల కు, ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు, .అత్యవసర సర్వీసులలో ఉన్న వారికీ , హోం ఓటింగు ను 85 ఏళ్ళు దాటిన వారికీ, 40 శాతం పైబడి దివ్యాంగులకు, కోవిడ్ బారిన పడిన వారికీ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అయితే ఓటర్లు అందుకు తగ్గ ప్రూఫ్ లను సబ్మిట్ చేయ్యాలని , ఆర్వో నిర్థారణ చేసుకున్న తదుపరి మాత్రమే వారికి ఓటింగ్ కి అవకాశం ఉంటుందన్నారు.

ఓటర్స్ హేల్ప్ లైన్ యాప్ :
ఓటర్లుగా నమోదు చేసుకొనుటకు , ఫిర్యాదులకు, ఎన్నికల ఫలితాల కోసం, అభ్యర్ధుల సమాచారం తెలుసు కొనుటకు, ఎన్నికలకు సంబంధిం చిన ఇతర సమాచారం కోసం ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను ఎన్నికల కమిషన్ రూపొందించి నట్లు తెలిపారు. మీడియా పాయింట్ ఏర్పాటు చేయడం, సమాచార లోపం లేకుండా ఒక ప్రత్యేక ఫోన్ నంబర్ అందుబాటు లో ఉంచి, ఎప్పటి కప్పుడు సమాచారం అంద చేయానున్నట్లు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వొచ్చే వార్తలను నిర్థారణ చేరుకున్న తదుపరి మాత్రమే ప్రచురించాలని కోరారు.

సిటిజెన్ విజిల్ యాప్ :
ఈ యాప్ ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గరనుండి పని చేస్తుందని, దీని ద్వారా మోడల్ కోడ్ ఉల్లంఘన పై ఫిర్యాదులు చేయవచ్చునని తెలిపారు. ఉల్లంఘన పై లైవ్ ఫోటోలు, వీడియో లు పెట్టి ఫిర్యాదు చేయవచ్చని, పాత వీడియో లు, రికార్డు లను అనుమతించరని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదుల కోసం 1950 కాల్ సెంటర్ ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, కాల్ చేసి ఎన్నికల సమాచారాన్ని, ఓటరు సమాచారాన్ని తెలుసుకోవచ్చునని అన్నారు. పోలింగ్ కేంద్రానికి దివ్యాంగులకు వారి అభ్యర్థులు మేరకు ఓటు వినియోగించుకునేందుకు ఫారం 12 డి అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (MCC) , మీడియా సర్టిఫికేషన్ అండ్ మోనిటరీ మానిటరింగ్ (MCMC) సోషల్ మీడియా సార్వత్రిక ఎన్నికల్లో నోటిఫికేషన్ ప్రారంభం నుండి ఎన్నిక ప్రక్రియలో కౌంటింగ్ పూర్తయ్యేంత వరకు మీడియా అనుసరించవలసిన అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డిఐపిఆర్ఓ సిహేచ్. శ్రీనివాస్, మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. .

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చిరంజీవి జన్మదిన వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా డా. పసుపులేటి హరిప్రసాద్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మెగాస్టార్ చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గుంటూరులో నిర్వహిస్తున్న జన్మదిన వారోత్సవాల్లో భాగంగా జరిగిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *