రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా సూక్ష్మ సేధ్య అధికారిగా అడపా దుర్గెష్ డిప్యూటీ డైరక్టర్ గా పదోన్నతి పొంది తూర్పు గోదావరీ జిల్లా పదవీ భాద్యతలను చేపట్టడం జరిగింది. గురువారం స్థానిక కలక్టర్ ఛాంబర్ లో జిల్లా కలక్టర్ డా కె. మాధవీలత ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత అభినందనలు తెలియ చేస్తూ, రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలియ చేశారు. జిల్లా పరిథిలో మెట్ట ప్రాంతాల్లో సూక్ష్మ సేద్యం ద్వారా మరిన్ని పంటలు పండే దిశలో చర్యలు తీసుకోవాలని సూచించారు. కృష్ణా జిల్లా కి చెందిన దుర్గేష్ 1991 లో హార్టికల్చర్ అధికారిగా ఉద్యోగం లో చేరడం జరిగింది. వివిధ హోదాల్లో కాకినాడ, రంపచోడవరం, జంగారెడ్డి గూడెం, భీమవరం లలో పని చేయ్యాడం జరిగింది. ప్రస్తుతం భీమవరం హార్టికల్చర్ కార్యాలయంలో సహాయ సంచాలకులు గా పని చేస్తూ, పదోన్నతి పై తూర్పు గోదావరీ జిల్లా కి రావడం జరిగింది. ఈ సందర్బంగా ఎపి ఎమ్ ఐ పి అధికారికి పలువురు అభినందనలు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News