వైయస్ ఆర్ చేయూత ద్వారా 4 వ విడత లో 85,311 మంది లబ్దిదారులకు 160 కోట్లు జమ…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల ఆర్థిక సామాజిక స్వావలంబన లక్ష్యంగా 4 వ వైయస్సార్ చేయూత ద్వారా జిల్లాలోని 85,311 మంది మహిళా లబ్దిదారులకు.159 కోట్ల 96 లక్షల మేర ఆర్ధిక ప్రయోజనాన్ని నేరుగా వారీ బ్యాంకు ఖాతాలకు జమ చెయ్యడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. గురువారం ఉదయం అనకాపల్లి జిల్లా లో జరిగిన రాష్ట్ర స్థాయి వైయస్సార్‌ చేయూత కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్దిదారులు బ్యాంకు ఖాతాలకు చేయూత ఆర్ధిక సహాయం జమ చేయడం జరిగింది. స్థానిక వీడియో కాన్ఫరెన్స్ కు స్థానిక  కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ డా. కే. మాధవీలత, డిసిసిబి ఛైర్మన్ ఆకుల వీర్రాజు, మహిళా లబ్దిదారులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేస్తున్న పథకాలు ప్రయోజనం ద్వారా మహిళలు ఆర్ధికంగా బలోపేతం చేయడం జరుగుతోందని అన్నారు. వైయస్ఆర్ ఆసరా ద్వారా లభిస్తున్న ఆర్ధిక సహాయం తో పెట్టుబడి పెట్టీ శాశ్వత ఆదాయ వనరులను అభివృద్ది కోసం వినియోగించు కోవాలని పిలుపు నిచ్చారు. జిల్లాలో మహిళల ఆర్ధిక సాధికారిత పెంచే క్రమంలో 45 నుందున్స్ట్ మహిళలు అర్హత కలిగిన వారికి రూ.18,750 లు చొప్పున ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. జగనన్న పాల వెల్లువ కింద పాడి పశువులను కొనుగోలు చేసి మరింత ఆర్ధికంగా బలోపేతం కావాలని, అదే విధంగా చిరు వ్యాపారాలు కొసం ఈ మొత్తాలను పెట్టుబడి సహాయంగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డిసిసిబి ఛైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లడుతూ, తూర్పు గోదావరీ జిల్లా కి చెందిన మహిళా లబ్దిదారులకు గత నాలుగు విడతల్లో రూ.633 కోట్ల 25 లక్షలు మేర ఆర్ధిక ప్రయోజనాన్ని అందచేయ్యడం జరిగిందన్నారు. 2020-21 ఏడాది తొలి విడతలో 74,096 మందికి 141 కోట్లు, 2021-22 లో రెండో విడతగా రూ.158 కొట్లు , 2022-23 లో మూడో విడత లో 92,970 మంది లబ్ధిదారులకు రు 174 కోట్ల 32 లక్షలు అంద చేసినట్లు తెలిపారు. జగనన్న ప్రభుత్వము మహిళల ఆర్ధిక సాధికారిత దిశగా ప్రాదాన్యత ఇస్తూ పెద్ద పీట వేస్తూ, దేశానికే ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  డి సి సి బి ఛైర్మన్ ఆకుల వీర్రాజు, పిడి డి ఆర్ డి ఎ – ఎన్ వివి ఎస్ మూర్తి, లబ్దిదారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన

-రహదారి నిర్మాణ పనుల పరిశీలన – నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశం -గత పాలకుల నిర్లక్ష్యం వల్లే రోడ్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *