-బాల్య వివాహాలు వద్దు… ఆడపిల్లల్ని చదివిద్దాం గోడ ప్రతులను ఆవిష్కరించారు.
-కలక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత దేశ చరిత్ర లో పురాణ కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు మహిళలకి అన్నీ విధాల ప్రాధాన్యతా ఇస్తూ మహిళా సాధికారిత కు నిదర్శనంగా నిలవడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత పేర్కొన్నారు. గురువారము సాయంత్రము స్ధానిక జిల్లా కోర్టు సమీపంలో సాయి రామ్ ఫంక్షన్ హాల్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ జిల్లా స్థాయి వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, మహిళలు ఆత్మ విశ్వాసంతో ఉండాలని, మహిళలు విద్యా వంతులైతే ఆ కుటుంబం, సమాజం అవుతుందని అన్నారు. ఈ ఏడాది అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా “మహిళలపై పెట్టుబడి పురోగతిని వేగవంతం చేస్తుంది” అనే నినాదంతో ముందుకు వెళుతోందనీ పేర్కొన్నారు. భారత దేశంలో మహిళా సాధికరకత లేదని అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రచారం ఉంది. అమెరికా వంటి దేశానికి మహిళా అధ్యక్షులు గా పని చేయలేదని, అదే మన దేశంలో రాష్ట్రపతి, దేశ ప్రధాని, ముఖ్యమంత్రి మహిళలు పని చేసినట్లు తెలిపారు. పురాణ కాలం నుంచి మహిళలకు అగ్ర తాంబూలం ఇస్తున్నారని, అర్ధనారీశ్వర స్వరూపంగా శివుడు, సీతారాములు, పార్వతి పరమేశ్వరులు, శ్రీమతి శ్రీ అంటూ మహిళలని ప్రాదాన్యత ఇస్తుంటే, విదేశాల్లో మిస్టర్ మిస్సెస్ అంటూ పురుషులకే ప్రాదాన్యత ఇస్తూ ఉండడం చూస్తున్నాం అన్నారు. వత్తిడి వల్ల ఆనారోగ్యంకు గురి అవుతామని మాధవీలత తెలియ చేశారు. వత్తిడిని అధిగమించడం కోసం ఆనందంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచం లో ప్రతి సమస్యకూ ఖచ్చితంగా పరిష్కారము ఉంటుందనీ అన్నారు. సమయానుకూలంగా ఆలోచించి తగిన కార్యాచరణ అమలు ద్వారా మాత్రమే సాధ్యం అన్నారు. చక్కటి కార్యచరణ ద్వారా కూడా వత్తిడిని దూరం చేసుకో వచ్చు అని మాధవీలత అన్నారు. మన కోసం ఖచ్చితంగా కొంత సమయం కేటాయించూ కోవాలని పిలుపు నివ్వడం జరిగింది. రాష్ట్రంలో ఆన్ని సంక్షేమ పథకాలలో మహిళలకి పెద్ద పీట వేస్తూ న్నారని తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి కె. ప్రత్యూష కుమారి, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ అధికారి కె. విజయ కుమారి, గిరిజన సంక్షేమ అధికారి కె ఎన్ జ్యోతి , , పీడీ ఎస్ ఎస్ ఎ .. ఎస్. సుభాషిణి, డి ఎమ్ (పౌర సరఫరాల) రాధిక, జిల్లా ఆడిట్ అధికారి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News