అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి కలుసుకున్నారు. ఈ సందర్భంగా విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అందజేసి, స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వేద ఆశీర్వచనం ఇచ్చారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో పాటు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ముఖ్యమంత్రిని కలిసారు.
Read More »Tag Archives: amaravathi
ఉమ్మడి కార్యచరణ ప్రణాళికతో ‘మానవ అక్రమ రవాణా నిరోధం’
-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడి -టాస్క్ ఫోర్స్ టీమ్ ల ఏర్పాటు -కళాశాలల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్‌ల ఏర్పాటు -సరిహద్దు ప్రాంతాల్లో విద్యావనరుల పెంపుపై దృష్టి -బాల్యవివాహ శిక్షలపై అబ్బాయిలకూ కౌన్సిలింగ్: ముఖ్య కార్యదర్శి అనూరాధ -మానవ అక్రమరవాణాపై అర్ధవంతంగా సమన్వయ సమావేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన “దిశ” చట్టమనేది ఒక బిల్లుగా మాత్రమే చూడరాదని.. మహిళలు, బాలికల సంరక్షణకు ఒక సమగ్రమైన ప్రణాళికగా రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ …
Read More »ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా రాష్ట్రాల మధ్య ఇంటర్ స్టేట్ అంశాలపై ఇరు రాష్ట్రాల సిఎస్ ల వర్చువల్ సమావేశం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్,ఒడిస్సా రాష్ట్రాల మధ్యగల వివిధ అంతర్ రాష్ట్ర అంశాల పరిష్కారానికి సోమవారం అమరావతి సచివాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఒడిస్సా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సురేశ్ చంద్ర మహాపాత్ర తదితర అధికారులతో వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు.ముఖ్యంగా ఇరు రాష్ట్రాల మధ్య అంతర్ రాష్ట్ర సమస్యలను నిర్ధిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే విషయమై ఇటీవల కాలంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భువనేశ్వర్ లో సమావేశం కావడం జరిగింది.తదుపరి ఇరు రాష్ట్రాల తరుపున ప్రభుత్వ ప్రధాన …
Read More »పోలీస్ డైరీ-2022 ఆవిష్కరించిన ఏపి డీజీపి గౌతమ్ సవాంగ్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారి కుటుంబాలకు ఎటువంటి ఆపదలు కలిగినా తాను అండగా ఉండి వారి సంక్షేమానికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ హామీ ఇచ్చినట్లు ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన పోలీస్ డైరీ-2022ని డిజిపి గౌతమ్ సవాంగ్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిజిపి గౌతమ్ సవాంగ్ మాట్లాడుతూ …
Read More »దేవుని ముందు వి ఐ పి లు ఎవరూ కాదు… : ఎమ్మెల్యే ఆర్కే
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు ఈనెల 13వ తేదీన ముక్కోటి ఏకాదశి సందర్భంగా దేవస్థానం ఏర్పాటు చేస్తున్న ముక్కోటి ఏర్పాట్లను ఆదివారం ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం నందు ఉత్తరద్వార దర్శనానికి మరియు దక్షిణావృత శంఖం తో ఇవ్వనున్న శంకు తీర్థం క్యూ లైన్లను, భద్రతా చర్యలను ఎమ్మెల్యే ఆర్కే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముక్కోటి …
Read More »రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యుల నియామకం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్థూ అకాడమీ బోర్డు సభ్యులుగా ఐదుగురిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీచేసింది. ఇందుకు సంబందించిన జి.ఓ.ఆర్టి నెం.205 ను డిశంబరు 22 ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి గంథం చంద్రుడు జారీచేశారు. గుంటూరుకు చెందిన షేక్ అబిదా బేగం, కర్నూలుకు చెందిన సయ్యద్ నూరుల్లా క్వాద్రీ, కర్నూలు జిల్లా నందికొట్కూరుకు చెందిన షేక్ అబ్దుల్ షుకూర్, ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన షేక్ మట్లపూడి బాజీ వలీ మరియు విశాఖపట్నానికి చెందిన తయ్యా బౌనిస్సా ను …
Read More »ఈ సమయం వెళ్ళిపోతుంది పోస్టర్ ఆవిష్కరణ…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గం లోని గంపలగూడెం లోగల ప్రగతి పబ్లిక్ స్కూల్ నందు గత సంవత్సర కాలంగా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్న గృహలక్ష్మి సీరియల్ హీరో నందు కేరాఫ్ చదలవాడ హరికృష్ణ నటిస్తున్న డాక్యుమెంటరీ ఫిలిం పోస్టర్ ను స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటరెడ్డి, మరియు నిర్మాత పామర్తి మేఘన తో కలిసి విద్యార్థులచే ఆవిష్కరించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డు సాధించిన సంస్థ శివ ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న చిత్రం విజయవాడ, కొండపల్లి, తదితర …
Read More »మూడో విడత జగనన్న విద్యా కానుకకు సిద్దం కావాలి…
-రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే మూడో విడత జగనన్న విద్యా కానుకను విజయవంతంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గో బ్లాక్ లోని ఆయన చాంబరులో పాఠశాలవిద్య, సమగ్రశిక్షా, ఎ.పి.రెషిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ, ఎ.పి.ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్,, ప్రభుత్వ పరీక్షల విభాగం, ఎస్.సి.ఇ.ఆర్.టి. తదితర శాఖ అధికారులతో మంత్రి …
Read More »అత్యుత్తమ డీజీపీగా ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు సేవలు అందించడంలో ఏపీ డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ దేశంలోనే అత్యుత్తమ డీజీపీగా నిలిచారని ది బెటర్ ఇండియా సంస్థ ప్రకటించింది. 2021లో ఉత్తమ సేవలు అందించిన 12 మంది ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల జాబితాను ఆ సంస్థ శనివారం విడుదల చేసింది. గడిచిన రెండేళ్లలో కోవిడ్ వల్ల అనేక కఠినమైన సవాళ్లను ఎదుర్కొవాల్సి వచ్చిందని, అటువంటి క్లిష్ట సమయంలోనూ డీజీపీ సవాంగ్ ప్రజలకు విశేష సేవలు అందించారని కితాబిచ్చింది. దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ …
Read More »నూతన సంవత్సరం సందర్బంగా కేక్ కట్ చేసిన సీఎం వైఎస్ జగన్…
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : నూతన సంవత్సరం సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ముఖ్యమంత్రి నివాసంలో కేక్ ఏర్పాటు చేసిన మంత్రులు, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సీఎంతో కేక్ కట్ చేయించారు. ముఖ్యమంత్రికి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, వెలంపల్లి శ్రీనివాసరావు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్, ప్రభుత్వ చీఫ్ అడ్వైజర్ ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి కార్యదర్శులు సోలోమన్ ఆరోఖియా రాజ్, రేవు ముత్యాలరాజు, ఇంటెలిజెన్స్ ఛీఫ్ రాజేంద్రనాథ్ రెడ్డి, …
Read More »
Prajavartha Online Telugu News