-2024-25, 2025-26 ఆర్ధిక సంవత్సరంలో బడ్జెట్ లో కేటాయించిన నిధులకు అదనంగా బేవరేజెస్ కార్పొరేషన్ నిధుల నుండి రూ. 11,140.46 కోట్ల ఖర్చు చేసిందన్న మంత్రి -గత ప్రభుత్వంలో సిక్స్ స్టెప్ వ్యాలీడేషన్ పేరుతో 11 లక్షల పెన్షన్లను అన్యాయంగా తొలగించారు. -గత ప్రభుత్వంలో 14.54 లక్షల మరణాలు,శాశ్వత వలసల కారణంగా పెన్షన్లు తొలగించింది. సగటున నెలకు 24,244 పెన్షన్లు తగ్గాయి. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కేవలం మృతి చెందిన,శాశ్వతంగా వలసవెళ్లిన పెన్షన్లు …
Read More »Tag Archives: amaravathi
ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏడు జిల్లాల కలెక్టర్ల అద్భుత ప్రజెంటేషన్లు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆరో కలెక్టర్ల సదస్సులో భాగంగా మొదటి రోజున ప్రజా సమస్యల సత్వర పరిష్కారం, సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా ఏడు జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్న వినూత్న ప్రాజెక్టుల (Success Stories) పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు కలెక్టర్లు తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలు సాధించిన వినూత్న ప్రాజెక్టుల గురించి వివరించారు. ఏఐ (AI) టెక్నాలజీతో మారుమూల గ్రామాల్లో సైతం ముందస్తుగానే జబ్బులను గుర్తించి ఉచిత వైద్యం అందిస్తున్న …
Read More »అనకాపల్లిలో జీరో వేస్ట్ రెసిడెన్షియల్ స్కూళ్లు
-చెత్త ద్వారా సర్క్యులర్ ఎకానమీ -కలెక్టరుకు సీఎం అభినందనలు -రాష్ట్రమంతటా ఈ పద్దతి అమలు చేయాలని ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను జీరోవేస్ట్ స్కూళ్లుగా మార్చుతూ ఆ జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, జిల్లా అధికారులు చేసిన వినూత్న ప్రయత్నం జిల్లా కలెక్టర్ల సదస్సు దృష్టిని ఆకర్షించింది. జిల్లాలో 114 సంస్థల్లో చెత్త, వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించడంలో జిల్లా కలెక్టర్ వినూత్నంగా వ్యవహరించారు. తడి చెత్త, పొడి చెత్తను వేరు చేస్తూ అన్ని రెసిడెన్షియల్ …
Read More »అన్నమయ్య జలధార అందరికీ ఆదర్శ ధార!
-కరవు నేల జలసిరులు కురిపించిన కలెక్టర్ -జిల్లాలో అంతర్గత కాలువల అనుసంధానం -వట్టిపోయిన చెరువులకు జలకళ -5 నెలల్లో 8.59 మీటర్ల భూగర్భజల మట్టం పెరుగుదల – కలెక్టర్ల సదస్సులో ఆదర్శపాఠంగా నిలిచిన అన్నమయ్య జిల్లా భగీరథ ప్రయత్నం -పులకించిన ముఖ్యమంత్రి -రాష్ట్రమంతటా జలధార అమలుకు ఆదేశం -కలెక్టర్ నిశాంత్ కుమార్‌కు సీఎం ప్రశంసల జల్లు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నమయ్య జిల్లా.. సీమ కరువు జిల్లాలో అత్యంత కరువు ప్రభావిత జిల్లాల్లో ఒక్కటి. వార్షిక వర్షపాతం 743 సెంటీమీటర్లే. తీవ్ర …
Read More »ఏపీ పర్యాటక రంగంలో సరికొత్త శకం..ఏఐ హబ్‌గా ఆంధ్రప్రదేశ్
-సాంస్కృతిక పర్యాటకానికి సరికొత్త రూపు..ఏరోస్ ఇన్నోవేషన్‌తో ‘కల్చరల్ ఏఐ’ భాగస్వామ్యం -పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ -ఆంధ్రప్రదేశ్‌ను గ్లోబల్ టెక్నాలజీ హబ్‌గా నిలపడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్న మంత్రి కందుల దుర్గేష్ -ప్రపంచంలోనే మొట్టమొదటి ‘లార్జ్ కల్చరల్ మోడల్స్’ ఎకోసిస్టమ్ ఏర్పాటుపై ముంబయి లో జరుగుతున్న 24వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ అమ్యూజ్‌మెంట్ పార్క్స్ అండ్ ఇండస్ట్రీస్ (IAAPI)ఎక్స్‌పోలో రెండో రోజు కీలక చర్చలు -ఏపీ వారసత్వ సంపదకు డిజిటల్ సొబగులు..పర్యాటక రంగంలో సాంకేతిక విప్లవం తెస్తూ దేవాలయాలు, వారసత్వ …
Read More »ఎన్నిసార్లు చెప్పినా….ఏలూరు జీజీహెచ్ సిబ్బంది తీరు మారదా?
– పేషెంట్ల పట్ల ఇంత నిర్లక్ష్యం ఏంటి? – ఏలూరులో శిశువు మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోండి… – ఏలూరు ఆర్.ఎం.ఓ కు మంత్రి సారథి సీరియస్ వార్నింగ్…. – ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మంత్రి పార్థసారథి సీరియస్…. అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతిచెందిన ఘటనపై రాష్ట్ర గృహనిర్మాణం, సమాచార మరియు పౌరసంబంధాలశాఖ మంత్రివర్యులు కొలుసు పార్థసారథి సీరియస్ అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్ల పట్ల సిబ్బంది …
Read More »రైతుల కోసం ఏఐ ఆగ్రోనమిస్ట్
-ఇప్పటికే 5.45లక్షల మంది రైతుల నమోద -రైతులంతా దీన్ని ఉపయోగించుకునేలా చూడాలి -ఎల్‌నినో తీవ్రత పొంచి ఉంది -జూన్-ఆగస్టు మధ్య సాధారణ స్థాయిని మించి ఎండలు -ప్రభుత్వం తదనుగుణంగా సన్నద్ధంగా ఉంది – జిల్లాల్లోనూ సమస్యలు రాకుండా చూడాలి -వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రైతులకు బహుళ ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వం రైతుల కోసం ప్రత్యేకంగా ఏఐ ఆగ్రోనమిస్ట్ యాప్ తీసుకొచ్చిందని, దీన్ని రైతులందరూ తప్పనిసరిగా ఉపయోగించుకునేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ …
Read More »16 న విజయవాడలో రాష్ట్రస్థాయి ప్రభుత్వ ఇఫ్తార్
-రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో ఇఫ్తార్ ఏర్పాట్లు -ఇఫ్తార్ ఏర్పాట్ల కోసం రూ. 1.50 కోట్లు విడుదల అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల స్థాయిలో ఇఫ్తార్ ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1.50 కోట్లు నిధులను విడుదల చేసింది.ముస్లిం మైనారిటీల కు అత్యంత భక్తిశ్రద్ధలతో కూడిన రంజాన్ మాసంలో సాయంకాలం ఉపవాస దీక్ష విరమణ కార్యక్రమంలో భాగంగా ఈనెల 16వ తేదీన రాష్ట్ర స్థాయి ప్రభుత్వ ఇఫ్తార్ కార్యక్రమాన్ని విజయవాడలో ఏ-కన్వెన్షన్ సెంటర్లో …
Read More »గల్ఫ్ ఉద్రిక్తతలపై ఆందోళన అవసరం లేదు
– రొయ్యల రైతులు పానిక్ హార్వెస్టింగ్ చేయొద్దు – వదంతులను నమ్మకుండా శాస్త్రీయంగా అక్వాకల్చర్ కొనసాగించాలి – షిప్పింగ్ కంటైనర్ల కొరతపై ప్రచారం అసత్యం – వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రొయ్యల రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. బుధవారం విజయవాడ క్యాంప్ కార్యాలయం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
Read More »ప్రజల వద్దకు బడ్జెట్
-త్వరలో జిల్లాలో బడ్జెట్ సమావేశాలు -ప్రజలకు బడ్జెట్ గురించి వివరించాలి -రాబోయేది అసాధరణ వృద్ధి సంవత్సరం -అధికారులు ద్విగిణీకృత ఉత్సాహంతో పనిచేయాలి -కేంద్రం నుంచి వచ్చే ప్రతి పైసా ఖర్చు చేద్దాం -అధికారులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సూచన అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర బడ్జెట్‌ను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా ప్రభుత్వం కార్యక్రమం రూపొందిస్తోందని, త్వరలోనే జిల్లాల్లో బడ్జెట్ సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు బడ్జెట్ గురించి వివరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. …
Read More »
Prajavartha Online Telugu News