గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ ప్రతి సోమవారం జరిగే పిజిఆర్ఎస్ కు అన్ని విభాగాల అధికారులు హాజరు కావాలని, ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలను విభాగాధిపతులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దేశిత గడువు మేరకు పరిష్కరించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు విభాగాధిపతులకు స్పష్టం చేశారు. సోమవారం డయల్ యువర్ కమిషనర్, నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో జరిగిన పిజిఆర్ఎస్ లో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత డయల్ యువర్ కమిషనర్ ద్వారా …
Read More »Tag Archives: guntur
దాతృత్వాన్ని చాటుకున్న ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ యూనియన్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : మునిసిపల్ కార్మికుల కష్టాన్ని చేతనైనంతలో తీర్చటానికి ముందుండే ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ యూనియన్ (APMEWU ) కష్టంలో వున్న ఓ కార్మికున్ని ఆదుకుని మరోసారి దాతృత్వాన్ని చాటుకుంది. ఆదివారం ఏపీ మున్సిపల్ ఇంజినీరింగ్ యూనియన్ విజయవాడ నగర కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో ప్రమాదానికి గురై గుంటూరు ప్రభుత్వం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న స్ట్రీట్ లైట్లు వర్కర్ ప్రభాకర్ కి కార్మికులు అందరి సహాయంతో 25,000 రూపాయలు ఆర్థిక సాయం గుంటూరు ఆస్పత్రికి వెళ్ళి వారు కుటుంబంకు అందజేశారు. …
Read More »ఇంటి వద్ద నుండే పురమిత్ర యాప్, మన మిత్ర వాట్సాప్ ద్వారా సేవలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పురపాలక సేవలను, ప్రభుత్వ సేవలను ఇంటి వద్ద నుండే ఫోన్ ద్వారా పొందడానికి వీలుగా రూపొందించిన పురమిత్ర యాప్, మన మిత్ర వాట్సాప్ (9552300009) ని గుంటూరు నగర ప్రజలు విస్తృతంగా వినియోగించుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, పురమిత్ర యాప్ ద్వారా షుమారు 122 రకాల పురపాలక సేవలు, గ్రీవెన్స్ లు, చెల్లింపులను చేతిలోని ఫోన్ ద్వారానే పొందవచ్చన్నారు. కార్యాలయాల చుట్టూ తిరగకుండా సేవలను …
Read More »ఓటర్ల మ్యాపింగ్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉండే బిఎల్ఓలపై కఠిన చర్యలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2025లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ చేయడంలో నిర్లక్ష్యంగా ఉండే బిఎల్ఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని, మ్యాపింగ్ పురోగతిపై ప్రతి 2 గంటలకు నివేదిక ఇవ్వాలని గుంటూరు తూర్పు నియోజకవర్గ(95) ఈఆర్ఓ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు సూపర్వైజర్లను ఆదేశించారు. శుక్రవారం గుంటూరు పశ్చిమ (94) నియోజకవర్గ ఈఆర్ఓ, నగర అదనపు కమిషనర్ చల్లా ఓబులేసుతో కలిసి శ్యామల నగర్ గేటు దగ్గరలోని 99 నుండి 104 వరకు సచివాలయాలు, రామిరెడ్డితోటలోని 32, …
Read More »అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు అక్షయ పాత్ర సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం అమవరావతి రోడ్ లోని ఐడి హాస్పిటల్ దగ్గర అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి పరిసరాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఆహారం అందించే ప్రాంతాల్లో శుభ్రత పాటించాలని, తిన్న అనంతరం ప్లేట్ లను వెంటనే …
Read More »నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల నిర్వహణలో అలసత్వాన్ని సహించం…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య పనుల నిర్వహణలో అలసత్వాన్ని సహించబోమని, విధుల్లో నిర్లక్ష్యంగా ఉండే కార్మికులు, కార్యదర్శులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శుక్రవారం ఎస్వీఎన్ కాలనీ, నాయుడుపేట, గౌతమి నగర్, ముత్యాలరెడ్డి నగర్, రెడ్డి పాలెం, ఉద్యోగ నగర్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి, పారిశుధ్య, అభివృద్ధి పనులను పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత ఎస్వీఎన్ కాలనీ మెయిన్ రోడ్ లో డ్రైన్ …
Read More »బిఎల్ఓలకు శిక్షణా కార్యక్రమం
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2025లో భాగంగా ఓటర్ల మ్యాపింగ్ 3 రోజుల్లో పూర్తి చేయాలని గుంటూరు తూర్పు 95 నియోజకవర్గ ఈఆర్ఓ, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు బిఎల్ఓలు, సూపర్వైజర్లను ఆదేశించారు. గురువారం కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎస్ఐఆర్ పై గుంటూరు పశ్చిమ (94), తూర్పు (95) నియోజకవర్గాల బిఎల్ఓలకు స్థానిక శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2002 అనంతరం ప్రస్తుతం …
Read More »ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు గుంటూరు నగరంలో వీధి కుక్కలను ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా వాటికి శాస్త్రీయ పద్దతిలో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు(ఏబిసి) చేయడానికి తగిన ఏబిసి సెంటర్ ని పొన్నూరు రోడ్ లో వేగంగా నిర్మాణం చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. గురువారం నగరపాలక సంస్థ కమిషనర్ చాంబర్ లో కమిషనర్ అధ్యక్షతన ఏబిసి కమిటి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సుప్రీం కోర్ట్ ఇటీవల మేనేజ్మెంట్ ఆఫ్ …
Read More »అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : అన్న క్యాంటీన్లను నోడల్ అధికారులు ప్రతి రోజు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించి, భోజనం తీసుకుంటున్నవారితో మాట్లాడి పరిసరాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అన్న క్యాంటీన్లలో ఆహారం కోసం వచ్చేవారికి ఏ సమస్య తలెత్తకుండా తగిన మౌలిక వసతుల కల్పన చేయాలన్నారు. ప్రధానంగా పారిశుద్యం, త్రాగునీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అక్షయ …
Read More »త్రాగునీరు, పారిశుధ్య సమస్యల శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలి…
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ అడవితక్కెళ్లపాడులోని రాజీవ్ గృహకల్ప సముదాయంలో నివాసితులు ఎదుర్కొంటున్న త్రాగునీరు, పారిశుధ్య సమస్యలను వారం రోజుల కాలపరిమితితో శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. గురువారం కమిషనర్ రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని, పుచ్చలపల్లి సుందరయ్య కాలనీలో అసంపూర్తిగా ఉన్న రోడ్లను, విద్యా నగర్, అంకిరెడ్డిపాలెంల్లో అభివృద్ధి పనులను ప్రత్యక్ష్యంగా పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ …
Read More »
Prajavartha Online Telugu News