Breaking News

Tag Archives: guntur

నవభారత నిర్మాత నెహ్రూ పై విమర్శలు తగవు

– డా|| ఎన్. తులసీ రెడ్డి, రాజ్యసభ మాజీ సభ్యులు గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : భారత్ సమగ్రాభివృద్ధికి పునాదులు వేసిన నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పై విమర్శలు చేయడం తగదని సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలను గౌరవించే ఆర్.ఎస్.ఎస్ లాంటి సంస్థలు సోషల్ మీడియాలో నెహ్రూ వ్యక్తిగత హననానికి పాల్పడటం దురదృష్టకరమని రాజ్యసభ మాజీ సభ్యులు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ డా|| ఎన్. తులసీ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 13వ తేదీన గుంటూరులోని …

Read More »

జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడంలో ఐఎంఏ గుంటూరు శాఖ ఆదర్శంగా నిలవాలి

-సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు వినతి గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : స్వాతంత్రానికి ముందు 1928లో స్థాపితమైన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ ఏపీ శాఖకు అనుబంధంగా 150 కి పైగా ఆసుపత్రులు, 1600 మందికి పైగా వైద్యులతో నిరంతరాయంగా ప్రజలకు వైద్య, ఆరోగ్య చైతన్యం అందించడంలో గుంటూరు శాఖ ముందుందని సీనియర్ జర్నలిస్టు నిమ్మరాజు చలపతిరావు కొనియాడారు. నిరంతరం ప్రజల సమస్యలు, హక్కుల కోసం నిలిచే జర్నలిస్టులకు వైద్య సేవలు అందించడంలో కూడా ఆదర్శంగా నిలవాలని నిమ్మరాజు కోరారు. ఇటీవల ఐఎంఏ గుంటూరు …

Read More »

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా మేనేజ్మెంట్ ప్లాంట్ ని పరిశీలన

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రోజు రోజుకి విస్తరిస్తున్న నగరాల్లో చెత్త డంపింగ్ యార్డ్ లు లేకుండా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ లు దోహదపడతాయని పంజాబ్ ప్రభుత్వ స్పెషల్ సెక్రెటరి పర్మీందర్ పాల్ సింగ్ అన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ స్టడీ టూర్ లో భాగంగా బుధవారం పంజాబ్ నుండి స్పెషల్ సెక్రెటరి పర్మీందర్ పాల్ సింగ్, పగ్వారా కార్పోరేషన్ కమిషనర్ అక్షిత గుప్తా, పిఎంఐడిసి సీనియర్ మేనేజర్ సిమర్జీత్ కౌర్ లు గుంటూరు నగర …

Read More »

గుంటూరు నగరంలోని అనధికార కట్టడాలపై ఉక్కుపాదం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : నగరంలో అనధికారిక నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారులు మంగళవారం పాత గుంటూరు, పెద్దపలకలూరు , గోరంట్ల, హిమనీ నగర్, రెడ్డిపాలెం, బ్రాడీపేట ప్రాంతాల్లో అనధికార నిర్మాణాలను గుర్తించి వాటిని తొలగించారు. ఈ సందర్భంగా సిటి ప్లానర్ మాట్లాడుతూ బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ జీవో ప్రకారం 30 ఆగస్టు 2025 తరవాత నగరపాలక సంస్థ పరిధిలో అనధికార కట్టడాలను సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారని, ప్లాన్ లేకుండా …

Read More »

అన్న క్యాంటీన్లు, పరిసరాలను సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లు, పరిసరాలను అక్షయ పాత్ర సిబ్బంది, జిఎంసి ప్రజారోగ్య సిబ్బంది సమన్వయంతో పరిశుభ్రంగా ఉంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం పల్నాడు బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి పరిసరాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలని అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి …

Read More »

సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో సిసి రోడ్లు, డ్రైన్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలని, నాణ్యత లేకుంటే బిల్లుల చెల్లింపు నిలిపివేయడంతోపాటు, పర్యవేక్షణ అధికారులపై చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ పట్టాభిపురం, స్తంభాల గరువు, లక్ష్మీపురం తదితర ప్రాంతాల్లో అభివృద్ధి పనులను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అభివృద్ధి పనులను నిర్దేశిత గడువు మేరకు …

Read More »

ఆంధ్రప్రదేశ్ లో టూరిజం రంగానికి కొత్త మైలురాయి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని శాఖమూరు గ్రామంలో నిర్మించిన దాసపల్లా 4-స్టార్ హోటల్ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ సుమారు 200 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మించబడింది మరియు ప్రత్యక్షంగా 400 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ కార్యక్రమంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ సీఈవో & ఏపిటిడిసీ ఎండీ అమ్రపాలి కాటా ఐ.ఏ.ఎస్., జాయింట్ కలెక్టర్, గుంటూరు ఆశుతోష్ …

Read More »

రానున్న రోజుల్లో 10 కోట్లు మంది లాక్ పతి దిదిలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : రానున్న రోజుల్లో 10 కోట్లు మందిని లాక్ పతి దిదిలుగా మార్చుటకు చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రతి ఏడాది లక్ష రూపాయల ఆదాయం కనీసం రావాలని, ప్రస్తుతం రెండు, మూడు కోట్లుగా ఉన్న లాక్ పతి దిదిల సంఖ్య పెంచుటకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. వాటర్ షెడ్ మహోత్సవ్ పై రెండు రోజుల జాతీయ సదస్సు రెండవ రోజు గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో  మంగళవారం జరిగింది. ఈ …

Read More »

సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారం

-వెంగళాయపాలెం చెరువును ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం రూ.1.20 కోట్లతో నిర్మించిన 21 ఎకరాల చెరువును కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ లతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళ వారం ప్రారంభించారు. కొండవాగు నీటి ప్రవాహం ఈ చెరువుకు ప్రధాన నీటి …

Read More »

పలు అభివృద్ధి పనులకు ఆమోదం…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరంలో సుమారు 66.38 కోట్ల రూపాయలతో పలు డివిజన్లలో అభివృద్ధి పనులను నిర్వహించుటకు స్థాయిసంఘం ఆమోదం తెలిపిందని స్తాయి సంఘ అధ్యక్షులు మరియు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర  తెలిపారు. సోమవారం స్థాయి సంఘం అధ్యక్షుల వారి ఛాంబర్ (మేయర్ ఛాంబర్) లో నగర కమీషనర్ పులి శ్రీనివాసులు తో కలిసి నగర పాలక సంస్థ స్థాయి సంఘ సమావేశం నిర్వహించి పలు అభివృద్ధి పనులకు ఆమోదం తెలిపారు. సమావేశంలో నగరంలోని ఆయా డివిజన్లకు సంబంధించిన …

Read More »