అన్న క్యాంటీన్లు, పరిసరాలను సిబ్బంది పరిశుభ్రంగా ఉంచాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అన్న క్యాంటీన్లు, పరిసరాలను అక్షయ పాత్ర సిబ్బంది, జిఎంసి ప్రజారోగ్య సిబ్బంది సమన్వయంతో పరిశుభ్రంగా ఉంచాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. మంగళవారం పల్నాడు బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ పరిశీలించి, భోజనం తీసుకుంటున్న వారితో మాట్లాడి పరిసరాలను పరిశీలించి, తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, శుభ్రమైన ఆహారం అందించాలని అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తెచ్చిందని, ప్రతి క్యాంటీన్ పరిశుభ్రంగా ఉండేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఫ్లోర్, ట్యాప్ లు, లైట్లు సమస్య ఉంటే సంబందిత నోడల్ అధికారి లేదా ఏఈల దృష్టికి తీసుకురావాలన్నారు. త్రాగునీరు ఉన్న ప్రాంతంలో వృధా నీరు నిల్వకుండా శుభ్రపరచాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *