-వెంగళాయపాలెం చెరువును ప్రారంభించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెం రూ.1.20 కోట్లతో నిర్మించిన 21 ఎకరాల చెరువును కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా.పెమ్మసాని చంద్ర శేఖర్, జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి కందుల దుర్గేష్ లతో కలిసి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మంగళ వారం ప్రారంభించారు. కొండవాగు నీటి ప్రవాహం ఈ చెరువుకు ప్రధాన నీటి వనరు. చెరువు వద్ద స్థానిక విఘ్నేశ్వరుడు, పోలేరమ్మ అమ్మవారి, ఆలయాన్ని మంత్రులు, అతిథులు దర్శించుకున్నారు. నక్షత్ర వనంలో మొక్కలను నాటారు. వాకింగ్ ట్రాక్ పై నడిచి పరిశీలించారు. పునరుద్ధరించిన బావిని, చిన్నారులకు ఏర్పాటు చేసిన పార్కు, వ్యాయామానికి ఏర్పాటు చేసిన పార్కును, ఓపెన్ ఎయిర్ థియేటర్ ను పరిశీలించారు.
అనంతరం మీడియా తో మాట్లాడుతూ సాంస్కృతిక వికాసానికి జలమే ఆధారమన్నారు. వాటర్ షెడ్ కార్యక్రమం, ప్రధాన మంత్రి సించయతీ యోజన ప్రధాన మంత్రి ప్రేరణతో అమలు చేయడం జరుగుతుందన్నారు. వెంగళాయపాలెంలో పురాతన చెరువును పునరుద్ధరించడం జరిగిందని అన్నారు. జల సంరక్షణ కార్యక్రమాలు వలన భూగర్భ జలాలు పెరగడమే కాకుండా మట్టి సారవంతంగా మారుతుందని చెప్పారు. భూగర్భ జలాలు ఉపరితల నీరు ఎక్కువ అవుతుందని పేర్కొన్నారు. జల సంరక్షణ కార్యక్రమాలు వలన సుస్థిర ఆర్థిక వ్యవస్థకు దోహదం చేస్తుందని అన్నారు. వెంగళాయపాలెం చెరువు ఆదర్శంగా ఉందని, ఈ నమూనాను దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లో అమలు చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. దీని ద్వారా ప్రజలకు మంచి ఆరోగ్యం, సాంస్కృతిక వికాసానికి దోహదం అవుతుందని చెప్పారు. బహుళార్థ ప్రయోజనకారిగా ఇటువంటి చెరువు నమూనాలు ఉపయోగపడతాయని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంచి ఆలోచనా విధానంతో అడుగులు వేస్తూ అభివృద్ధి సాధిస్తూ ఆదర్శంగా ఉంటున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నసీర్ అహ్మద్, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్ మాధవ్, కేంద్ర ప్రభుత్వ భూ వనరుల విభాగం కార్యదర్శి మనోజ్ జోషి, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శశిభూషణ్ కుమార్, కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ జాయింట్ సెక్రెటరీ నితిన్ కడే, రాష్ట్ర పంచాయతీ రాజ్ సంచాలకులు మైలవరపు కృష్ణ తేజ, జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా, గ్రామీణ అభివృద్ధి శాఖ వాటర్ షెడ్ విభాగం సంచాలకులు వై.వి.కె. షణ్ముఖ కుమార్, జాయింట్ కమిషనర్ శివరాం, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News