Breaking News

అనుమతి లేనిదే భవనం నిర్మించరాదు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అనుమతి లేనిదే భవనం నిర్మించరాదని విజయవాడ నగరపాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ కె. సంజయ్ రత్న కుమార్ అన్నారు. మంగళవారం ఉదయం చీఫ్ సిటీ ప్లానర్ గారి ఆదేశాల మేరకు, కార్పొరేషన్ పరిధిలోని ఉన్న అనధికార నిర్మాణాలపై చర్యలు చేపట్టడం జరుగుతున్నది, ఈ ప్రక్రియలో గురునానక్ కాలనీ, రామలింగేశ్వర నగర్, హిందూ హైస్కూల్ ప్రక్కన, కొత్తపేట, కేటి రోడ్ లో ఉన్న అనధికార కట్టడాలను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకున్నారని అన్నారు.

ఈ సందర్భంలో చీఫ్ సిటీ ప్లానర్ మాట్లాడుతూ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏవైనా అనధికార నిర్మాణాలు లేదా భవన మార్పులు అనుమతులు లేకుండా చేపడితే, వాటిపై తక్షణ చర్యలు తీసుకోబడతాయని, VMC టౌన్ ప్లానింగ్ బృందం నిరంతర పరిశీలన చేపట్టి, అనధికార నిర్మాణాలను గుర్తించి తొలగించే కార్యక్రమం కొనసాగిస్తోందిని, కావున నగర ప్రజలు తమ నిర్మాణాలు అనుమతులతోనే చేపట్టవలెనని, లేనిపక్షంలో విధినిర్వహణ చర్యలు తప్పవని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *