Breaking News

Tag Archives: machilipatnam

అర్హులను అన్వేషించి మరీ లబ్ధి చేకూర్చే పారదర్శక పాలన ఇదే… : మంత్రి జోగి రమేష్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : గత ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఏదో రకమైన వంక పెట్టి వారికి ఆ ఫలాలు దక్కకుండా ఎలా కత్తిరించాలనే ఆలోచనతో పరిపాలన చేయగా, నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను అన్వేషించి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ …

Read More »

ఎమ్మెల్సీ ఎన్నికల సమర్ధ నిర్వహణకు సమాయత్తం కావాలి… : కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్‌ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పై గురువారం సాయంత్రం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నీలం స్వహనే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఎన్నికలలో ఓటర్ల నమోదు, నిర్వహణ, ప్రవర్తనా నియామళి, ముసాయిదా, తదితర అంశాలపై అధికారులకు ఆమె దిశా నిర్దేశం చేశారు. అనంతరం కలెక్టర్‌ తన ఛాంబర్ లో అధికారులతో మాట్లాడుతూ, ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల నమోదు, అభ్యంతరాలు, ఓటును ఆధార్ కార్డుతో …

Read More »

ఈనెల 6న న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ క్యాంప్ – డి ఎల్ ఎస్ ఏ కార్యదర్శి వెల్లడి

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఏ. పద్మ గురువారం న్యాయ సేవాసదన్ లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 6న స్థానిక జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాలులో న్యూ మాడ్యూల్ లీగల్ సర్వీసెస్ కాంప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా డిఎల్ఎస్ఎ కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 నుండి నవంబర్ 13 వరకు జిల్లా వ్యాప్తంగా Pre-mature …

Read More »

ఒక పక్క సంక్షేమం.. మరోపక్క అభివృద్ధి.. ఇవే జగన్ లక్ష్యాలు — మంత్రి జోగి రమేష్

-చినపాండ్రాకలో రూ. 99.15 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేసిన మంత్రి -రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన శీతనపల్లి గ్రామ సచివాలయం ప్రారంభోత్సవం -చిన చందాలలో రూ.33 లక్షల వ్యయంతో నిర్మించిన వంతెన ప్రారంభం -కృత్తివెన్ను గ్రామంలో రూ.22.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్ర భవన నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కృత్తివెన్ను (చినపాండ్రాక/శీతనపల్లి/చిన చందాల/), నేటి పత్రిక ప్రజావార్త : ఒకపక్క ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడం, మరోపక్క రాష్ట్ర …

Read More »

సంపూర్ణ పారిశుధ్యం పై దృష్టి పెట్టండి!! — రాష్ట్ర పంచాయతీ రాజ్‌ గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న స్వచ్చ సంకల్పం కార్యక్రమం ద్వారా గ్రామాలలో సంపూర్ణ పారిశుద్ధ్యంపై దృష్టి పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అన్ని జిల్లాల కలెక్టర్లకు సూచించారు. గురువారం మధ్యాహ్నం గ్రామ కంఠం, రీ సర్వే, జగనన్న స్వచ్చ సంకల్పం, ఉపాథి హామీ పథకం, పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి గ్రామ సచివాలయాలు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ లు, రైతు భరోసా కేంద్రాలు, లేబర్ మొబలైజేషన్, ఏ ఎం సి యు, బి …

Read More »

పాండురంగస్వామి వారి పాదాలు తాకి పూజించే అవకాశం ఉన్న ఆలయం ఇదే !! — ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భక్తులు నేరుగా స్వామివారి పాదాలు తాకి పూజించేందుకు అవకాశం ఉన్న ఏకైక మహిమ గల గొప్ప పుణ్యక్షేత్రం మచిలీపట్నం చిలకలపూడిలోని పాండురంగస్వామి ఆలయం మాత్రమేనని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) తెలిపారు. గురువారం  ఆయన చిలకలపూడి పాండురంగస్వామీ దేవస్థానం వద్ద కార్తీక మాస ఉత్సవాల పురస్కరించుకొని స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. తొలుత ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే పేర్ని నానికి స్వాగతం పలికారు. …

Read More »

ప్రజా కేంద్రీకృత విధానం కొనసాగడం హర్షణీయం!!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు సమాజంలోని ఆఖరి లబ్ధిదారునికి చేరే లక్ష్యంతో ప్రజా కేంద్రీకృత విధానం ప్రస్తుతం కొనసాగడం ఎంతో హర్షణీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం మచిలీపట్నం జిల్లా పరిషత్ సమావేశపు మందిరం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. తొలుత వేదికపై ఉన్న అధికారులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి …

Read More »

ఒకే రోజులో పంచారామాల దర్శన భాగ్యం కల్పించనున్న ఆర్టీసీ

-అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలకు జిల్లాలో అన్ని డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కార్తీక మాసంలో ఒకేరోజులో పంచారామాల దర్శనానికి జిల్లాలోని అన్ని డిపోల నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తున్నదని జిల్లా ప్రజా రవాణా అధికారి జి నాగేశ్వరరావు వెల్లడించారు. శనివారం మచిలీపట్నం డిపోలో పాత్రికేయుల సమావేశంలో జిల్లా ప్రజా రవాణా అధికారి మాట్లాడుతూ కార్తీక మాసంలో ఒకేరోజులో అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోట పంచారామాలను దర్శించినచో కోటి తీర్థముల …

Read More »

వైయస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై ఐసిడిఎస్ అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్

పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త : పాఠశాల, అంగన్వాడి, ఆసుపత్రి ఈ మూడు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తే భావితరాలు బాగుంటాయని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కానూరులో ఐసిడిఎస్ జిల్లా కార్యాలయంలో ఐసిడిఎస్ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించి జిల్లాలో ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సమీక్షించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఐసిడిఎస్ ద్వారా అమలవుతున్న రెగ్యులర్ కార్యక్రమాలతో పాటు వైఎస్సార్ సంపూర్ణ పోషణ, సప్లిమెంటరీ న్యూట్రిషన్, హెల్త్ చెకప్, ఇమ్యునైజేషన్ కార్యక్రమాలు బాగానే చేస్తున్నారని సంతృప్తి …

Read More »

మంగినపూడి బీచ్ ను సందర్శించే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగరాదు… : ఎమ్మెల్యే పేర్నినాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నవంబర్ 8 వ తేదీన మంగినపూడి బీచ్‌లో జరిగే కార్తీక మాస ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని, కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు, అపశృతులు చోటు చేసుకోకుండా అందరూ అప్రమత్తంగా ఉండి విజయవంతంగా నిర్వహించాలని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఉదయం ఆయన కార్తీక మాస ఉత్సవాల ఏర్పాట్ల విషయమై స్వయంగా పరిశీలించేందుకు …

Read More »