మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో సోమవారం(25.04.2022) ఉదయం 10:30 గంటల నుండి ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ఉదయం 10 గంటలకు స్పందన కార్యక్రమానికి తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, మండల స్థాయిలోనూ స్పందన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ప్రజలు తమ అర్జీలను మండల, డివిజన్ స్థాయిలోనూ సమర్పించ వచ్చునని …
Read More »Tag Archives: machilipatnam
చెప్పిన మాటకు కట్టుబడే వుండే వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి… : మంత్రి జోగి రమేష్
బంటుమిల్లి/క్షామక్షిపురం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే వ్యక్తని, ఇచ్చిన ప్రతి హామీని తూచ తప్పకుండా నెరవేరుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు. శనివారం సాయంత్రం బంటుమిల్లి మండలం, పెదతుమ్మిడి గ్రామంలో డ్వాక్రా అక్కాచెల్లెమ్మలకు వైఎస్సార్ సున్నా వడ్డీ రాయితీ పంపిణీ, గ్రామ/వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రదానం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెడన నియోజకవర్గంలో రూ.3.70 …
Read More »లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు అందించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లక్ష్యాల సాధనకు బ్యాంకర్లు పూర్తిస్థాయిలో సహకరించాలని, రైతుల పంట రుణాలు, విద్యా రుణాలు, గృహ నిర్మాణ రుణాలు, జగనన్న చేదోడు, టిడ్కో గృహ లబ్దిదారులకు ఇబ్బంది లేకుండా రుణాలు అందించాలని కలెక్టర్ పి. రంజిత్ బాషా బ్యాంకర్లకు సూచించారు. స్థానిక జిల్లా పరిషత సమావేశపు మందిరంలో శుక్రవారం మధ్యాహ్నం బ్యాంకర్లు, జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించి వివిధ అంశాలకు సంబంధించి వివరంగా మాట్లాడారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని సులభతర విదానాలను అనుసరిస్తూ …
Read More »గృహ నిర్మాణం వేగవంతం చేయండి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న గృహ నిర్మాణ లబ్దిదారులు సకాలంలో తమగృహాలను నిర్మించుకోవాలని, ప్రభుత్వం లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లించేందుకు సంసిద్ధంగా ఉందని అధికారులు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం స్పందన సమావేశపు మందిరంలో శనివారం వివిధ శాఖల అధికారులతో వైఎస్ ఆర్ జగనన్న సం పూర్ణ గృహ నిర్మాణ పథకంపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. గృహ నిర్మాణాల పురోగతి, మౌలిక సదుపాయాల కల్పన …
Read More »ఉపరాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు పక్కాగా నిర్వహించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 18వ తేదీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మచిలీపట్నం పర్యటన సందర్భంగా గురువారం కలెక్టర్ పి రంజిత్ భాష జిల్లా ఎస్పీ, జిల్లా పరిషత్ చైర్పర్సన్, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులతో కలిసి జిల్లా పరిషత్ లో ఏర్పాట్లు పరిశీలించి, అనంతరం జడ్పీ హాలులో సమావేశం నిర్వహించి ఏ ఏ శాఖలు ఏ ఏ ఏర్పాట్లు చేయాలో సూచనలు ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఈ నెల 18వ తేదీన ఉదయం …
Read More »రైల్వే స్టేషన్ లో కూలింగ్ వాటర్ ప్లాంట్ ప్రారంభం !!
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆర్ధిక న్యాయానికి పునాదులేసిన జకాత్ అనే పవిత్ర కార్యం ద్వారా నిరుపేదలను ఆదుకోవడంలో కలిగే ఆనందం మరే కార్యం ద్వారా లభించదని, ఖురాన్ బోధకులు సైది ముర్షిది షా హుజూర్ ఆల్ హజ్ ముఫ్తి అబ్దుల్ హలీం సాహెబ్ ఎన్నో అమూల్య వచనాలు అత్యంత అనుసరణీయమని, రాష్ట్రవ్యాప్తంగా వారిచే నిర్వహించబడే వివిధ సామాజిక సేవా కార్యక్రమాలు ఎంతో అమూల్యమైనవని మాజీ మంత్రి , మచిలీపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. బుధవారం …
Read More »సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు పక్కాగా అమలు చేయాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు సంపూర్ణంగా అమలు చేయడం ద్వారా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష పేర్కొన్నారు. వివిధ సంక్షేమ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ బంగ్లాలో బుధవారం సమావేశం నిర్వహించి వివిధ శాఖల ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలు సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు ( sustainable development goals) అమలుకు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖలు వారివారి ప్రగతి సూచికల వారీగా నిర్దేశించిన …
Read More »జిల్లాలో ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి జనన ధృవీకరణ కుల ధ్రువీకరణ పత్రాల జారీ లక్ష్యం
-ఇందుకోసం కార్యాచరణ రూపొందించాలి అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ -వచ్చే నెల నుండి జిల్లాలో గ్రామదర్శిని పక్కాగా అమలుకు చర్యలు -రెవెన్యూ చట్టాలు, ప్రభుత్వ ఉత్తర్వులు క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకుని అమలుచేయాలి -రెవెన్యూ అధికారులకు సూచించిన కలెక్టర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా మంగళవారం కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాల్లో జిల్లాలో అందరు ఆర్డీవోలు తాసిల్దార్లు, హౌసింగ్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలు గృహనిర్మాణం, ఓ …
Read More »భావితరాలకు స్పూర్తిదాత మహాత్మ జ్యోతిబా పూలే — జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : అంటరానితనాన్ని నిర్మూలించి సంఘ సంస్కర్తగా సమసమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్పూర్తి ప్రదాతగా నిలిచిన గొప్ప వ్యక్తి మహాత్మ జ్యోతిబాపూలే అని కృష్ణాజిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు. జ్యోతిబాపూలే 196 వ జయంతి సందర్బంగా సోమవారం స్థానిక వలందపాలెం సాంఘిక సంక్షేమ వసతి గృహం వద్ద జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, మచిలీపట్నం నగరపాలక సంస్థ డెప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, మాజీ మునిసిపల్ …
Read More »రంజాన్ మాసంలో ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేయాలి – జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర రంజాన్ మాసంలో ప్రార్ధనా మందిరాలు, ముస్లిమ్ సోదరులు అధికంగా నివసించే ప్రాంతాలలో ప్రత్యేక సదుపాయాలు త్వరితగతిన కల్పించాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమై వారం రోజులైన సందర్భంగా జిల్లా యంత్రాంగం ముస్లిమ్ సోదరులకు కల్పించవల్సిన ప్రత్యేక సదుపాయాలపై కలెక్టర్ వాకబు చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని స్పందన సమావేశపు మందిరం లో జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా , జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వరరావు, …
Read More »
Prajavartha Online Telugu News