Breaking News

Tag Archives: machilipatnam

సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉంది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సమాజానికి సాహిత్య అవసరం ఎంతో ఉందని కథ, నవల, వ్యాసం, కవిత, ఇలా అన్ని ప్రక్రియలను చదివి వాటిలోని మానవీయ విలువలను అవగాహన చేసుకున్ననాడు మరిన్ని మంచి రచనలు వెలువడడానికి ఆస్కారం ఉందని ఆ దిశగా ప్రతీ ఒక్కరూ కృషిచేసి మన తెలుగుభాష గొప్పదనాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తిచేయాలని, ఆ దిశగా కృషిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. …

Read More »

క్షయ వ్యాధి నివారణపై కృష్ణాజిల్లాలో విస్తృత ప్రచారం !!

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : మానవాళికి ఎంతో ప్రమాదకరమైన క్షయ వ్యాధి నివారణ పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తతో ఉండాలని, మార్చి 24 వ తేదీన ‘ వరల్డ్ టీబి డే ‘ సందర్భంగా ఆ వ్యాధిపై జిల్లావ్యాప్తంగా 21 టీ బి యూనిట్ల పరిధిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కృష్ణాజిల్లా క్షయవ్యాధి నివారణాధికారిణి జి. జె నాగలక్ష్మి తెలిపారు. కృష్ణాజిల్లా కలెక్టర్ జె. నివాస్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆమె అన్నారు. విజయవాడ వరల్డ్ విజన్, ఫాక్ట్ ప్రాజెక్ట్ …

Read More »

స్పందన రీ ఓపెన్డ్ అర్జీలపై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే అర్జీలలోని రీ ఓపెన్డ్ ఆర్జీలపై జిల్లా కలెక్టర్ జె నివాస్ సమీక్ష నిర్వహించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు, తాసిల్దారులు, జిల్లా అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిష్కరించగలిగే అర్జీలను అతి తక్కువ సమయంలోనే పరిష్కరించి అర్జీదారునకు నాణ్యమైన పరిష్కారం చూపాలని అన్నారు. తమకు సరైన పరిష్కారం లభించలేదనే ఫిర్యాదు మరల రాకూడదన్నారు. సోమవారం …

Read More »

ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుంది… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దశాబ్ద కాలంగా వేలాదిమంది ఆర్టీసీ ఉద్యోగులు అభద్రతా భావంతో ఉండేవారిని, ప్రభుత్వ ఉద్యోగిగా మారాలనే వారి చిరకాల వాంఛ ముఖ్యమంత్రి జగన్ నెరవేర్చారని, ఆర్టీసీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఎప్పుడూ సానుభూతిగా ఉంటుందని రాష్ట్ర రవాణా ,సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) పేర్కొన్నారు. సోమవారం ఉదయం శాసనసభ సమావేశాలలో తన శాఖలకు సంబంధించి క్వశ్చన్ అవర్ ఉండటంతో ఉదయం 7:30 గంటల సమయంలో మంత్రి పేర్ని నాని హడావిడిగా తాడేపల్లి …

Read More »

కరగ్రహారం లేఅవుట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలి -అధికారులను ఆదేశించిన మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని ఆదివారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి కరగ్రహారం లేఅవుట్ సందర్శించి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం ముడ కార్యాలయంలో రెవెన్యూ మున్సిపల్, డ్వామా, పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ విద్యుత్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి కరగ్రహారం లేఅవుట్ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. నియోజకవర్గంలో అర్బన్, రూరల్ లబ్ధిదారులకు 12 బ్లాకులలో 16వేల మంది పైగా లబ్ధిదారులకు 300 ఎకరాలలో అతిపెద్ద లేఅవుట్ …

Read More »

19 వ డివిజన్ వైఎస్ఆర్ కాలనీలో 117 మందికి ఇళ్ల స్థల పట్టాలు పంపిణీ చేసిన మంత్రి పేర్ని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి  పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, కార్పొరేటర్లు అధికారులతో కలిసి స్థానిక వైయస్సార్ కాలనీలో 19 వ డివిజన్ (రైల్వే స్టేషన్ సమీపంలో) ఆదివారం 117 మంది లబ్ధిదారులకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొంతమంది మహిళలు తమకు ఇళ్ల స్థలాలు మంజూరు రాలేదని మంత్రికి తెలుపగా, వీరి పేర్లు నమోదు చేసుకుని, వారి అర్హతలు …

Read More »

నగరంలో మెరుగైన తాగునీటి సౌకర్యం కల్పించుటకు చర్యలు…

-4వ డివిజన్లో రూ. 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులను ప్రారంభించిన మంత్రి పేర్ని మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర రవాణా సమాచార సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య నాని, నగర మేయర్ మోక వెంకటేశ్వరమ్మ ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి శుక్రవారం స్థానిక 4వ డివిజన్ సర్కార్ తోట ఎస్టేట్ రోడ్ లో వినాయకుడి గుడి వద్ద నుండి ఉల్లిపాలెం రోడ్డు వరకు 20 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు పనులు మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా …

Read More »

వృద్ధులకు సేవ చేయడం ఒక అదృష్టం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వృద్ధుల సమస్యల పరిష్కారానికి సమాజంలో ప్రతి ఒక్కరూ శ్రద్ధ చూపాలని, వేధింపులు, ఆరోగ్య సమస్యల నుంచి వృద్ధులను సంరక్షించేందుకు అందరూ చొరవ చూపాలని, వృద్ధులకు సేవచేయడం ఒక అదృష్టంగా భావించాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పిలుపునిచ్చారు. గురువారం ఉదయం స్థానిక ఈడేపల్లి లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిర్వహణలో జెట్టి నరసింహం స్మారక వృద్ధాశ్రమంను మంత్రి సందర్శించారు. 30 మంది మహిళలు, …

Read More »

యావత్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తా !!… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఇప్పటికే కోట్లాది రూపాయల అభివృద్ధి పనులు పట్టణంలో పూర్తయ్యాయిని, అసంపూర్తిగా ఉన్న మిగిలిన సమస్యల పై అధికారులను సమన్వయపర్చి యావత్ నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరిస్తానని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని ) తెలిపారు.  గురువారం ఉదయం 7 గంటల సమయంలో ఆయన మచిలీపట్నం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 46 , 47 వ డివిజన్లకు సంయుక్తంగా ఈడేపల్లి వయోవృద్ధుల న్యాయ సేవ కేంద్రం రోడ్డులో …

Read More »

వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు ప్రభుత్వం శ్రీకారం… : మంత్రి పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో పాటు, సకాలంలో పంటలు వేయటం మొదలు కోతలు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా సాగి నష్టాలు, కష్టాల బారినుంచి రైతులు విముక్తి అవుతారని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ప్రకటించారు. బుధవారం సాయంత్రం ఆయన మచిలీపట్నం మండలం తాళ్లపాలెం గ్రామంలో వైఎస్ఆర్ యాంత్రీకణ సేవా పథకంలో భాగంగా 25 లక్షల 98వేల రూపాయల విలువగల …

Read More »