మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఎన్నికల కు శనివారం ఇద్దరు వైయస్సార్ సిపి పార్టీ అభ్యర్థుల తరఫున రెండు నామినేషన్లు రిటర్నింగ్ అధికారి మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ ( రెవెన్యూ) డాక్టర్ కే.మాధవి లత వారి కార్యాలయంలో దాఖలు చేశారు. బుద్ధా వెంకటేశ్వరరావు పదవి విరమణ తో కాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీ మొండితోక అరుణ్ కుమార్ తరఫున వారి ప్రతినిధి గాదెల వెంకటేశ్వరరావు (నందిగామ …
Read More »Tag Archives: machilipatnam
సినిమా వినోదమే కాదు ప్రేక్షకునికి మంచి సందేశం ఇవ్వాలి… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : సినిమా అనేది మన సమాజంలో ఇప్పటికీ చాలా శక్తివంతమైన మాధ్యమం అని అది కేవలం వినోదంగానే ఉండకూడదని, ప్రేక్షకులకు ఉపయోగపడే మంచి సందేశం సైతం అందులో మిళితమై ఉంటే బాగుంటుందని తాను వ్యక్తిగతంగా కోరుకొంటానని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) అభిప్రాయం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన …
Read More »ప్రమాదకర వాతావరణ పరిస్థితులలో సముద్రస్నానాలు తగదు… : జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిందని ప్రమాదకర వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు ప్రజలను అనుమతించడం లేదని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం మధ్యాహ్నం ఆమె మచిలీపట్నం మంగినపూడి బీచ్ వద్దకు పలువురు అధికారులతో కలిసివెళ్లి వాతావరణ పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా జె సి డాక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, ప్రచండమైన తుపాను చెన్నైకి …
Read More »విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించండి… : కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎ. మాధవీలత సూచించారు. గురువారం ఆమె మచిలీపట్నం చిలకలపూడి శ్రీ పాండురంగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించేందుకు ఆకస్మిక తనిఖీ చేపట్టారు విద్యార్థులతో ఆమె నేరుగా మాట్లాడి మధ్యాహ్న భోజన నిర్వహణ గురించి పలువురు విద్యార్థిని విధ్యార్దులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భోజనాన్ని, స్టాక్ …
Read More »వాతావరణ పరిస్థితుల దృష్ట్యా కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు అనుమతి లేదు-ఆర్ డివో
– తుఫాను లేదా అతిభారీ వర్షాలకు అవకాశం- అప్రమత్తంగా ఉండాలి మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి గురువారం ఆర్ డివో కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశాలున్నాయని, ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా ప్రాంతానికి రెడ్ ఎలర్ట్ ప్రకటించిందని, ఈ నెల 18, 19 తేదిల్లో అతిభారీ వర్షాలు పడే అవకాశముందని భారత వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసిందన్నారు. ఈ నేపద్యంలో ఈ …
Read More »దళారీలు, మిల్లర్ల ప్రమేయం లేకుండా సింగిల్ విండో విధానం లో ధాన్యం సేకరణ… : జెసి మాధవి లత
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ )డాక్టర్ కే.మాధవి లత మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అగ్రికల్చర్ అడ్వైజరీ బోర్డ్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి 2021 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ విధివిధానాలు వివరించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 189 మిల్లులు ఉన్నాయని, తూకాలలో ఎలాంటి తేడాలు రాకుండా ప్రతి మిల్లు వద్ద వీఆర్వోకు విధులు కేటాయించామని తెలిపారు. 8నుండి 10 మిల్లులకు ఒకరిని సివిల్ సప్లై డిప్యూటీ తాసిల్దార్ ను పెట్టామని, మండల …
Read More »ఆర్యవైశ్యుల పట్ల ముఖ్యమంత్రి నిర్ణయం సాహసోపేతమైనది… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : దేవుడి ఆస్తులు కైంకర్యంకు గురి కాకుండా మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆర్యవైశ్యుల దేవాలయాల నిర్వహణ విషయంలో కొన్ని మినహాయింపులు ఇస్తే ఆయన తనయుడిగా ముఖ్యమంత్రి జగన్ మరో అడుగు ముందుకేసి ఆర్యవైశ్య సత్రాలను క్రయ విక్రయాలు జరపడం మినహా దేవదాయశాఖ అన్ని సెక్షన్ల నుంచి వెసులుబాటు కల్పించిన నిర్ణయం ఎంతో సాహసోపేతమైనదని రాష్ట్ర రవాణా , సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. సోమవారం స్థానిక ఆర్ అండ్ …
Read More »వాతావరణ పరిస్థితులను సమీక్షించిన తర్వాతే సముద్ర స్నానాలు… : మచిలీపట్నం ఆర్డీవో ఖాజావలి
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : భారత వాతావరణ శాఖ జారీ చేసిన ముందస్తు హెచ్చరికల నేపథ్యం లో 17వ తారీఖు సాయంత్రం నాటికి ఒక స్పష్టత రానుందని, ఆయా వాతావరణ పరిస్థితులను18 వ తేదీన సమీక్షించి 19 వ తేదీ కార్తీక పౌర్ణమి రోజున మంగినపూడి సముద్రస్నానాలకు వచ్చే సందర్శకు లకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని మచిలీపట్నం ఆర్డిఒ ఎన్ఎస్ కె. ఖాజావలి పేర్కొన్నారు. సోమవారం ఆయన తన కార్యలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, …
Read More »కార్తీక పౌర్ణిమికు వివిధ శాఖల సమన్వయంతో పటిష్టమైన ఏర్పాట్లు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఈ నెల 19 వ తేదీన కార్తీక పౌర్ణమి సముద్ర స్నానాలకు 2 లక్షల మందికి పైగా భక్తులు మంగినపూడి బీచ్ కు వస్తారని ఒక అంచనా ఉందని , పక్కా ప్రణాళికతో జిల్లా రెవెన్యూ, పోలీసు, మత్స్య, వైద్య, అగ్ని మాపక ఆర్టీసీ, మున్సిపల్ తదితరశాఖల అధికారులు చక్కని సమన్వయంతో వ్యవహరించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) …
Read More »అభద్రతా భావాన్ని ఆడపిల్లకు కల్పిస్తే , మౌనంగా ఉండరాదు – మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బాలికల పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తూ అభద్రతా భావాన్ని ఎవరైనా కల్పిస్తే, వారి దుశ్చర్యలను భరిస్తూ మౌనంగా ఉండరాదని గళం విప్పి పెద్దలకు తెలియచెప్పాలని ప్రతి ఆడపిల్ల ఈ విషయాన్ని తప్పక నేర్చుకోవాలని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) సూచించారు. సోమవారం తన కార్యాలయం వద్దకు వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలను ఆయన నేరుగా కలుసుకున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గూర్చి …
Read More »
Prajavartha Online Telugu News