మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : బందరు మండలంలో దెబ్బతిన్న రోడ్లన్నింటికి మరమ్మత్తులు చేపట్టి అభివృద్ధికి చర్యలు చేపడతామని రాష్ట్ర రవాణా సమాచార శాఖా మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) అన్నారు. శుక్రవారం మంత్రి కార్యాలయం వద్దకు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల నుండి వివిధ సమస్యలతో వచ్చిన ప్రజానీకాన్ని మంత్రి కలసి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. బందరు మండలం భోగిరెడ్డిపల్లి గ్రామంలో సమస్యలు సర్పంచ్ గరికిపాటి శ్రీరాములు గ్రామస్థులతో కలసి మంత్రికి వివరించారు. గ్రామంలో గౌడపాలెం సెంటరు నుండి …
Read More »Tag Archives: machilipatnam
ప్రణాళికాబద్ధంగా గృహ నిర్మాణాల పురోగతి సాధించాలి…
-మండలవారి లక్ష్యాలు నిర్దేశించిన జెసి డవలప్మెంట్ ఎల్. శివశంకర్ మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జాయింట్ కలెక్టర్ డవలప్మెంట్ ఎల్. శివశంకర్ కలెక్టరేట్ స్పందన మీటింగ్ హాలులో సోమవారం బందరు డివిజనుకు సంబంధించి ఎంపిడివోలు, తహసిల్దార్లు, హౌసింగ్ డిఇ, ఎఇలు, ఉపాధిహామి ఎపివోలతో సమావేశం నిర్వహించి బందరు డివిజనులో గృహనిర్మాణ పురోగతిపై మండల వారి సమీక్షించారు. ఆయా మండలాల్లో గల ఇంజనీరింగ్ అసిస్టెంట్లు ఒకొక్కరు రోజుకు కనీసం 5 గృహలు బెన్మెంట్ స్థాయికి నిర్మించుకునేలా చూడాలని, ఈ విధంగా ప్రతి మండలానికి వచ్చేవారానికి …
Read More »దివ్యాంగుడి అర్జీను సహృదయంతో పరిష్కరించిన జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆధార్ నవీకరణ కష్టాలు సాంకేతిక సమస్యలు ఓ దివ్యాంగుడి పింఛన్ పై తీవ్ర ప్రభావం చూపింది. వేలిముద్రలు సరిగా పడలేదన్న కారణంగా నిలిచిపోయిన పింఛన్ ను జిల్లా కలెక్టర్ జె నివాస్ పెద్ద మనస్సుతో చొరవ చూపి పునరుద్ధరించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో నిరుపేద తల్లితండ్రులు తమ పుత్రుడికి కల్గిన కష్టాన్ని జిల్లా కలెక్టర్ వద్ద విన్నవించుకొన్నారు. వాసే వాసు (12) పుట్టుకనుంచి దివ్యాంగుడని, గతం నుంచి మంజూరై వస్తున్న పింఛన్ ను …
Read More »వైద్యాశాఖలో తాత్కాలిక పద్ధతిలో వైద్యుల నియామకానికి వాక్ ఇన్ ఇంటర్వ్యూ…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కృష్ణాజిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు జాతీయ ఆరోగ్యమిషన్ పధకం క్రింద తాత్కలిక పద్దతిలో ఒక ఏడాది కాల పరిమితితో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ జగ్గయ్య పేటలో 2, నూజివీడులో 1, విజయవాడలో 2 మొత్తం 5 వైద్యాధికారుల నియమాకానికి అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి డా. ఎం. సుహాసిని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వారి ఓరిజినల్ సర్టిఫికెట్స్ మరియు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో మచిలీపట్నంలో …
Read More »చైల్డ్ ఫండ్ ఇండియా ,హోప్ స్వచ్ఛంద సేవా సంస్థల సేవాతత్పరత అభినందనీయం… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : ఆపదలో ఉన్న రోగులకు ప్రాణాధారంగా నిలిచే వివిధ ఉపకరణాలు పెద్ద మనస్సుతో అందిస్తున్న స్వచ్ఛంధ సేవా సంస్థల సేవాతత్పరత, ఔన్నత్యం ఎంతో అభినందనీయమని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) కొనియాడారు. సోమవారం ఆయన స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. చైల్డ్ ఫండ్ ఇండియా ,హోప్ వారి సౌజన్యంతో చైల్డ్ ఫ్రెండ్లీ కోవిడ్ కేర్ విభాగానికి వివిధ వైద్య ఉపకరణాలను నిర్వాహకులు మంత్రి …
Read More »” మా “ఎన్నికలకు ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు… : మంత్రి పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించి జరుగుతున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా ) ఎన్నికలలో ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి గానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గానీ ఎటువంటి సంబంధం లేదని రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని ) ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అక్టోబరు 10న జరగనున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (జరిగే ఎన్నికలకు ప్రభుత్వానికి, జగన్మోహనరెడ్డికి ఏ …
Read More »జిల్లా జడ్జి జి.రామకృష్ణ ని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా కలెక్టర్ జె.నివాస్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా కలెక్టర్ జె.నివాస్ సోమవారం జిల్లా కోర్టులో నూతనంగా జిల్లా జడ్జి బాధ్యతలు స్వీకరించిన జి. రామకృష్ణ ని మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చాం అందజేశారు. అనంతరం జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కలెక్టర్ జిల్లా జడ్జి కి వివరించారు. 10వ అదనపు జిల్లా జడ్డి నరసింహమూర్తి, పర్మినెంట్ లో ఆదాలత్ చైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.
Read More »కోవిడ్-19 టీకా ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్…
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : కోవిడ్ వ్యాక్సిన్ వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో కోవిడ్-19 ఎక్స్ ప్రెస్ వాహనాలను జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రారంభించారు. సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ఆవరణలో ఆయన జాయింట్ కలెక్టర్ డా. కె. మాధవీలత, బందరు ఆర్ డివో ఎస్ఎస్ కె. ఖాజావలి మరియు ఇతర వైద్యాధికారులతో కలసి జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు …
Read More »“ఇ.బి.సి నేస్తం” పధకం అమలుకు కసరత్తు ప్రారంభించాలి… : జిల్లా కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వెనుకబడిన తరగతుల వర్గాల స్త్రీల అభ్యున్నతికి ఆర్ధిక సహాయం అందించే ఉద్దేశ్యంతో “ఇ.బి.సి నేస్తం” పధకం ప్రారంభించబడనున్నదని, ఈ పధకం అమలుకు కసరత్తు ప్రారంభించాలని సంబంధిత అధికారులను జిల్లా క లెక్టర్ జె.నివాస్ ఆదేశించారు. సోమవారం ఉదయం కలెక్టర్ వారి కార్యాలయం సమావేశపు హాలులో ఆయన జాయింట్ కలెక్టర్లు డా. కె. మాధవీలత (రెవిన్యూ ) , ఎల్. శివశంకర్ (అభివృద్ధి), కె.మోహనకుమార్ (ఆసరా) లతో …
Read More »“ప్రజల ముంగిటకే న్యాయం” లోక్ అదాలత్ ల లక్ష్యం – జిల్లా జడ్జి
-ప్రభుత్వ వ్యవస్థలను అనుసందానిస్తూ లోక్ అదాలత్ ద్వారా ప్రజలకు సత్వర న్యాయం మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త : పాన్ ఇండియా అవేర్ నెస్ అండ్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిఎన్ఎస్ఎ స్టాల్‌ను జిల్లా జడ్జి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జి. రామకృష్ణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ భారతదేశంలో ఇప్పటికీ చాలా వరకు ప్రజలు న్యాయస్థానాలకు ఏవిధంగా రావాలి వారికి ఏదైన …
Read More »
Prajavartha Online Telugu News